సమైక్య రాష్ట్రం అంటూ డ్రామాలాడుతున్న లీడర్ల లాగులూడదీసే పని చేస్తున్నాడు లగడపాటి అన్న టాక్ రాజకీయాల్లో భలే పసందు చేస్తోంది. అందరు మాంసాహారులే కాని రొయ్యల మూట మామమైంది అన్న చందంగా సమైక్యవాదుల పరిస్థితి నెలకొన్న విషయం అందరికి తెలిసిందే. ఎలా అంటే కేంద్రమంత్రుల నుంచి ఎమ్మెల్యేల దాకా సమైక్యమనే అంటన్నా... తెలంగాణ ప్రక్రియ జరిగిపోతుండడమే ఈ భావనకు కారణం.

ఇక లీడర్ల డ్రామాలేంటో చూద్దాం, తెలుగుదేశం ఎంపీలు సమైక్య రాష్ట్రం కోసం రాజీనామాలు చేసారు, కాంగ్రెస్ ఎంపీలు, కేంద్రమంత్రులు కొందరు రాజీనామాలు చేసారు, ఇక వైఎస్సార్ సిపి వాళ్లయితే టోటల్ గా రాజీనామాలు చేసారు, కాని పదవులూడింది ఎందరికి ఒక్క హరిక్రిష్ణ, మరో మంత్రి విశ్వరూప్ తప్ప. అంటే  మిగిలిన వారందరివి రాజీ డ్రామాలే అని అందరు అంటున్నమాటే కదా. అయినా సరే రాజీనామాలు చేసాం, ఆమోదించకుంటే మేమేం చేస్తాం అంటూ తప్పించుకుంటున్నారు.

అయితే ఆడ్రామాలకు కూడా లగడపాటి చెక్ పెట్టే పని చేసాడు అంటున్నారు రాజకీయ పరిశీలకులు. కారణం తను రాజీనామా చేసి 60 రోజులవుతున్నా ఆమోదించడం లేదు, దయచేసి అది ఆమోదించేలా చూడండి అంటూ ఏకంగా ఢిల్లీ హైకోర్టులో న్యాయపోరాటానికి దిగాడు, ఈ పోరాటంలో ఆయన గెలిచాడనుకో డ్రామాలాడుతున్న వారి లాగూలూడగొట్టినట్టే, ఆ తీర్పు వచ్చే లోపు మిగతా వారు కూడా అలా కోర్టుకు పోవాలి అన్న సంకేతాలిచ్చి ఆ పని ఇప్పుడే మొదలుపెట్టినట్టే అన్న వాఖ్యలు రాజకీయవర్గాల్లో గరంగరం టాపిక్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: