రథసారధిగా మాత్రం ఉండలేనంటాడు.సహజంగా బలమైన నేత వెనుక శక్తివంతమైన అమాత్యుని పాత్రకు ఉండవల్లి సూపర్ గా సరిపోతాడు. రాజు వేరు.. మంత్రి వేరు. రాజుగా తనకున్న శక్తియుక్తులు పరిమితం కాబట్టి..
తన అసంతృప్తిని చెప్పటం మినహా ఆయనింకేమీ చేయటం లేదు.


తాజాగా విభజనపై ఒక లాజిక్ ను తెరపైకి తీసుకొచ్చాడు. అదేంటంటే.. పూర్వం రోజుల్లో కూడా రాజధాని నగరం పేరు మీదే రాజ్యాలు ఉండేవి కానీ.. రాజ్యాల పేరు వేరు.. రాజధాని వేరు అనేవి ఉండంటూ కొత్త పాయింట్ బయటకు తీశారు.అయ్యోధ్య నగర రాజు, హైదరాబాద్ రాజు, మైసూర్ రాజు అని రాజధాని పేరు మీదే పిలిచారని.. అలాంటప్పుడు హైదరాబాద్ ను ఎలా విడదీస్తారని ప్రశ్నించారు.

దాదాపు 57ఎళ్లు కలిసి ఉన్నాక.. ఇంకో పదేళ్లు మాత్రమే నీకు హైదరాబాద్ తో లింకు ఉంటుంది.. తర్వాత ఈ నగరం నీది కాదనటం అన్యాయమని ఆక్రోశించారు. దేశ చరిత్రలో 5.5కోట్ల మంది ప్రజల అభిప్రాయం కాదంటూ ఒక ప్రాంతాన్ని రెండుగా విభజించటం చాలా దారుణమంటూ మండి పడ్డారు. విషయం చేజారిపోయిందన్న విషయాన్నిఉండవల్లి సైతం ఒప్పుకోవటం కొసమెరుపు.

మరింత సమాచారం తెలుసుకోండి: