కేంద్రంలో రాబోయే కాలంలో చక్రం తిప్పేది మేమే అంటూ ఫోజులు కొడుతున్న జగన్ , చంద్రబాబులకు షాకిచ్చారు కామ్రేడ్లు అంటున్నారు. ఈమేరకు ఈ ఏపి లీడర్లద్దరికి కేంద్రంలోని మూడోఫ్రంట్ లో చోటు లేదంటూ మూతి మీద చెప్పేసారట. అంటే దేశం లో 2014 ఎన్నికల్లో మూడో ఫ్రంట్ కే అధికార అవకాశాలున్నాయని అంటున్న తరుణంలో మన జగన్ బాబు, చంద్రబాబుకు కేంద్రంలో చక్రం తిప్పే అవకాశాలు లేనట్టే కదా...

పొరపాటున యూపిఏ, ఎన్టీఏ వచ్చినా కూడా అతి పెద్ద పార్టీలు వాటిలో కాంగ్రెస్, బిజేపిలుంటాయి కనుక భాగస్వాములవుతారని కాని, మరీ తమదే నడిపించుకునేంత పొజిషన్ వీరికి ఉండదంటున్నారు. అందుకే కామ్రేడ్స్  తీసుకున్న నిర్ణయం నిజంగా వీరిద్దరికి షాకింగ్ న్యూసే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. భవిష్యత్తు జాతీయ పార్టీలకు బదులు ప్రాంతీయ పార్టీలదే  అని, కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం వారికే ఉందని అందరు భావిస్తున్న విషయం తెలిసిందే. అందుకే జాతీయ పార్టీలతో కూడిన కూటమిల నుంచి విడిపోయిన ప్రాంతీయ పార్టీలు పెట్టి పెడుతున్న మూడో కూటమి వైపే అందరి దృష్టి పడింది.

అయితే ఈ మూడో ఫ్రంట్ లో ఏపి కి చెందిన అతి పెద్ద ప్రాంతీయ పార్టీలకు చాన్స్ లేదని వామపక్షాలు సంకేతాలు జారీ చేసి రాబోయే కాలంలో కేంద్రంలో ఏపి సీన్ తుస్సేనని తేల్చారని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. కారణం ఈ మూడో ఫ్రంట్ ఏర్పాటుకోసం వామపక్షాలు దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలతో త్వరలో సమావేశం నిర్వహిస్తోంది. యూపిఏ, ఎన్డీఏ తో తెగ తెంపులు చేసుకున్న పార్టీలతో పాటు, వాటిని విభేదించే పార్టీల నేతలను అందరిని పిలిచి ఒకే వేదికపై కూర్చోబెట్టి తృతీయ ఫ్రంట్ కు రూపం ఇవ్వాలన్నది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశ్యం.

ఈ సమావేశానికి ఏపిలోని ముఖ్యమైన, అంతే కాదు, రేపు కేంద్రంలో చక్రం తిప్పుతామని చెప్పుకుంటున్న వైఎస్సార్ సిపి, టిడిపి లకు పిలుపు రాలేదు, టిఆర్ఎస్ పరిస్థితి అదే. ఈసమావేశం ఏర్పాటు చేస్తున్న వామపక్షాల మద్య ఉన్న రాజకీయ విభేదాలు దీనికి కారణం అని పైకి చెపుతున్నా నిజానికి వీరు మూడో ఫ్రంట్ కు పనికి రారని వారు భావించడమే అంటున్నారు. జగన్ కాంగ్రెస్ తో ఒప్పందం కుదుర్చుకునే బెయిల్ తెచ్చుకున్నాడని, ఆయన ఎలాగు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపిఏకే మద్దతిస్తాడని భావనకు వచ్చారట. అలాగే టిడిపి కూడా బిజేపి నేతృత్వంలోని ఎన్డీఏకే మద్దతిస్తాడని నిర్ణయానికి వచ్చేసారట. అంతే కాదు చంద్రబాబు కూడా అదే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక టిఆర్ఎస్ కూడా తెలంగాణ విషయంలో కాంగ్రెస్ లో విలీనమో, పొత్తో అన్న ఒప్పందం కుదుర్చుకుందని అందరు భావిస్తున్నదే. అందుకే టిఆర్ఎస్ కు కూడా మూడో ఫ్రంట్ ఏర్పాటు మీటింగ్ కు ఆహ్వానం అందలేదంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: