నీవులేని ప్రతికదలికలో నన్ను ఆపింది నువ్వు పిలిచిన వైనం నీవులేని ప్రతిక్షణములో నీ దరి చేరలేదని నాలో చేరింది మౌనం నీ తోడు దొరికిన దారుల్లో సజావుగా సాగిపోతోంది నా ప్రయాణం నీ నీడ కానరాని ప్రతి చోట ఆగిపోతుంది నా పయనం నీ పాదముద్రలు ఎరుగని త్రోవలో నీలిమేఘాల్ని సైతం ఆపేసింది ఆ నీలిగగనం నీ ఊసువినపడని ఆ క్షణంలో నన్నావరించింది ఒక మౌనం నీ రూపం కనపడని ఆ నిమిషంలో చీకటితో నిండిపోయింది నా నయనం నీ అడుగులు తెలియని ఘడియల్లో సాగనంటోంది నా గమనం నీవు, నీ తోడులేనిదే నేనులేను అంటోంది నా ఈ జీవితం నిన్ను చూడని, నీతో మాట్లాడని రోజే నా జీవితంలో సార్ధకతలేని తరుణం నీవు నా ప్రక్కన లేనిదే నాపై పడలేనంటోంది ఆ సూర్యకిరణం నీ ప్రేమ, స్నేహంలేని ఈ జీవితం వ్యర్ధమని నను చేరిపోతోంది మరణం

మరింత సమాచారం తెలుసుకోండి: