రాష్ట్ర విభజన సమయంలో జగన్‌ సమైక్యనినాదం అందుకోవడంతో ఒక్కసారిగా సీమాంధ్రలో జగన్‌ బలం అనూహ్యాంగా పెరిగింది. మరో వైపు తెలంగాణలో వైకాపా తూడ్చుకు పెట్టుకు పోయింది. అయితే జగన్‌ సీమాంధ్రపై నమ్మకం పెట్టుకుని ముందుకు సాగాడు. ఆయన భావించినట్లుగానే విభజన తర్వాత వైకాపా సీమాంధ్రలో బలమైన పార్టీగా నిలిచింది. రాష్ట్రంను విభజించింది కాంగ్రెస్‌ అని, అందుకు సహకరించింది టీడీపీ అనే ప్రచారం చేయడంలో జగన్‌ సక్సెస్‌ అయి సమైక్య హీరోగా, సీమాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా అవుదాం అని భావించాడు. కాని జగన్‌ ఆశలు అడియాశలు అయ్యేట్లు అనిపిస్తోంది. రాష్రం విభజన తర్వాత మెల్లగా తెదేపా తన బలంను పెంచుకుంటూ వచ్చింది. సీమాంధ్ర పునర్‌నిర్మాణం ఒక్క తెలుగు దేశం పార్టీ వల్లే సాధ్యం అంటూ తెదేపా నాయకులు ప్రచారం చేస్తుండటం, రాజధాని నిర్మాణం చంద్రబాబు ఆధ్వర్యంలోనే సాధ్యం అవుతుంది అంటూ తెలుగు దేశం శ్రేణులు ప్రజల్లోకి తీసుకు వెళ్లడం ప్రారంభించారు. సీమాంధ్ర రాజధానిని హైదరాబాద్‌లా హైటెక్‌ సిటీగా మార్చగల సత్తా ఒక్క చంద్రబాబుకే ఉంది అంటూ ప్రజల్లో నమ్మకం తేగలిగారు. దాంతో సీమాంధ్ర యువత ఎక్కువగా చంద్రబాబు వైపు చూస్తున్నట్లు అనిపిస్తోంది. మరో వైపు మోడీ ప్రభంజనంతో కూడా సీమాంధ్రలో బీజేపీ బలం చేకూర్చుకుంది. టీడీపీ, బీజేపీల పొత్తుతో రెండు పార్టీల కూటమి సీమాంధ్రలో మెజారిటీ స్థానాలను దక్కించుకోగలదు అని, రెండవ స్థానంలో వైకాపా నిలువనున్నట్లు తాజా సర్వేలు వెళ్లడవుతున్నాయి. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ఎదురు గాలి వీస్తున్న సమయంలో సీమాంధ్రలో కూడా జగన్‌ పార్టీకి కష్టాలు తప్పేలా లేవు అని తాజాగా ఎన్‌డీటీవీ సర్వే వెళ్లడిరచింది. సీమాంధ్రలోని 25 లోక్‌ సభ స్థానాలకు గాను తెలుగు దేశం, బీజేపీ కూటమి 15 స్థానాలను, వైకాపా 9 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉంది అని సదరు సంస్థ నిర్వహించిన ఒపీనియన్‌ పోల్‌లో వెళ్లడిరచింది. దాంతో జగన్‌ టెన్షన్‌లో పడ్డట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు బలమైన పార్టీగా కొనసాగుతూ వచ్చిన వైకాపా తీరా ఎన్నికలు ముంచుకు వచ్చిన తరుణంలో ఇలా కావడంతో వైకాపా నేతల్లో గుబులు మొదలైనట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: