తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిద్రలేస్తే జగన్ ను తలుచుకొంటున్నాడు. అనునిత్యం జగన్ మోహన్ రెడ్డిపై ధ్వజమెత్తుతూ విమర్శలు చేస్తున్నాడు. జగన్ కు ఓటు వేయవద్దని కోరుతూ తనకు ఓటు వేయమని తెలుగుదేశం అధినేత ప్రసంగిస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ ప్రచార గర్జనల్లో చంద్రబాబు కేవలం జగన్ మీదే కాన్సట్రేట్ చేశాడు. తనకు ప్రధాన శత్రువు జగన్ మోహన్ రెడ్డేనని బాబు భావిస్తున్నాడు. కాంగ్రెస్ , కిరణ్ పార్టీలను అసలు ప్రత్యర్థులుగా కూడా పరిగణించడం లేదు చంద్రబాబు. మరి చంద్రబాబు తీరు అలా ఉంటే ఆయన మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ మాత్రం భిన్నంగా వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకూ భారతీయ జనతా పార్టీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కానీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పై కానీ తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది లేదు. ఆ మధ్య ఎవరో ఒక బీజేపీ నేత బ్రదర్ అనిల్ కుమార్ పై తీవ్రస్థాయి విమర్శలు అయితే చేశాడు. కానీ ఎన్నికల పరంగా అజెండా పరంగా విధి విధానాల విషయంలో భారతీయ జనతా పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ను సూటిగా టార్గెట్ చేసుకొంది లేదు. మరి తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో అసంతృప్తిగా ఉంది. బీజేపీ వాళ్లు జగన్ ను తిడితే బావుంటుందని తెలుగుదేశం ఆశిస్తోంది.అయితే బీజేపీ వాళ్లు దూరదృష్టితో ఆలోచిస్తున్నట్టుగా ఉన్నారు. ఇప్పుడు తాము జగన్ ను తిట్టి లేదా తీవ్రస్తాయిలో విమర్శించి సాధించేది ఏమీ లేదని బీజేపీ అర్థం చేసుకొంది. అందుకే తెలివిగా నడుచుకొంటోంది. అయితే ఈ నెలలోనే బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ ఏపీకి ప్రచారానికి వస్తున్నాడట. మరి అప్పుడు గనుక మోడీ జగన్ ను టార్గెట్ గా చేసుకొంటే తెలుగుదేశానికి అమితానందం కలుగుతుంది. ఒకవేళ మోడీ కేవలం కాంగ్రెస్ ను మాత్రమే విమర్శించి జగన్ గురించి ప్రస్తావించకపోతే తెలుగుదేశం పార్టీ ఇబ్బందుల్లో పడినట్టేనేమో!

మరింత సమాచారం తెలుసుకోండి: