భాజపాలో ఇప్పుడు గొప్ప సంకటస్థితి కొనసాగుతోంది. విశాఖ సీటును పురంధ్రీశ్వరికి ఇప్పించాలని కొంత మంది కమ్మ కుల గురువులు ప్రయత్నిస్తున్నారు. చిత్రంగా అదే సీటును ఆశిస్తున్న కంభంపాటి హరిబాబు కూడా అదే సామాజికవర్గానికి చెందినవారు. వెంకయ్య ఆశీస్సుల కంభపాటికే వున్నాయి. కానీ ఎన్టీఆర్ బిడ్డగా పురంధ్రీశ్వరికి అవకాశం ఇవ్వాలని కొందరు అదే సామాజిక వర్గ పెద్దలు వెంకయ్య, హరిబాబులపై వత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. కానీ ఇక్కడ ఓ సమస్య వచ్చింది. విశాఖపై గడచిన పదేళ్లలో విపరీతమైన పట్టు సాధించిన వివిధ పార్టీలకు చెందిన కమ్మ పెద్దలంతా, హరిబాబు కు అనుకూలంగా వుండడం. ఈ రోజు విశాఖలో నలుగురైదుగురు కలిసి, విశాఖను వలసవాదులకు ఇవ్వకూడదని, విజయమ్మను ఓడిస్తామని చిన్న హల్ చల్ చేసారు. దాన్ని టీవీ 9 పదే పదే ప్రసారం చేసింది. బాగానే వుంది. కానీ ఆ నలుగురు ఎవరో కానీ, వారికి ఎంతవరు ఉత్తరాంద్ర అభిమానం వుందో కానీ, ప్రకాశం జిల్లా వారు గో బ్యాక్ అంటూ నినాదాలు కూడా చేసారు. మరి విజయమ్మకు ప్రకాశం జిల్లాకు లింకేమిటో? లేక పురంధ్రీశ్వరిని దృష్టిలో వుంచుకుని ఇలా చేసారా? అలా చేసి వుంటే, వెనుక ఎవరున్నట్లు? ఆ మాటకు వస్తే, విశాఖలో టికెట్లు సంపాదించిన చాలా మంది స్థానికేతరులే. కంభంపాటి హరిబాబుది విశాఖ కాదు. గంటా శ్రీనివాసరావుది అంతకన్నా కాదు. ఈ జాబితా ఇలా రాసుకుంటూ పోతే కొండవీటి చాంతాడంత వుంటుంది. ఎమ్ వి విఎస్ మూర్తితో మొదలయింది ఇది. ఆ వ్యవహారం అలా వుంటే, విజయలక్ష్మీ వైకాపా అభ్యర్థి కావడంతో పురంధ్రీశ్వరి ఆశలు చిగురించాయి. ఎన్టీఆర్ బిడ్డ-వైఎస్ భార్యల నడుమ పోటీ అంటే రసవత్తరంగా వుంటుందని, అందుకని ఆమెకే టికెట్ ఇవ్వాలని కొత్త వాదనలు భాజపాలో తెరపైకి వస్తున్నాయి. మహిళ పై మహిళను పోటీకి పెట్టడం ఆనవాయితీగా కూడా వస్తోంది. అందుకని అది కూడా పురంధ్రీశ్వరికి ప్లస్ అవుతోంది. ఇక్కడ ఇంకో సమస్య వుంది. కేవలం ఎంపీ టికెట్ అంటే పెద్దగా ఎవరూ పంతాలకు పోయేవారు కాదు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం గ్యారంటీగా వస్తుందని వార్తలు వినరావడం, సీమాంధ్ర భాజపా అధ్యక్షుడి హోదా వుండడం వల్ల మంత్రి పదవికి అవకాశం వస్తుందని హరిబాబు భావిస్తున్నారు. అదే ఆలోచన పురంధ్రీశ్వరిది కూడా. అందుకే వారు ఇరువురు విశాఖ సీటు కోసం ఎవరి ప్లాన్లు వారు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: