విజయవాడ పార్లమెంట్‌ తెలుగుదేశం అభ్యర్థిగా కేశినేని శ్రీనివాస్‌ (నాని) అభ్యర్థిత్వం ఖరారై పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నుంచి బి ఫారం అందుకున్న గంటల వ్యవధి లోనే ఆయన ప్రత్యర్థి వర్గం కత్తులు దూస్తోంది. దేశం అభ్యర్థి నానికి టికెట్‌ ఖరారు కావడంపై పొట్లూరి వర్గీయులు కారాలు మిరియాలు నూరుతు న్నారు. అభ్యర్థిత్వం దక్కిందన్న ఆనందంలో ఉన్న నానికి పిీవీపీ వర్గీయుల హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. పీవీపీకి అభ్యర్థిత్వం ఖరారు చేయని పక్షంలో నానిని వ్యతిరేకిస్తామని ఇప్పటికే హెచ్చరికలు చేసిన పీవీపీ వర్గం, పవన్‌ అభిమానులు తాజాగా మంగళవారం నాడు అల్టిమేటం జారీ చేశారు. పవన్‌ కళ్యాణ్‌ సూచనలను లెక్కచేయకుండా ఏకపక్షంగా సీటు దక్కించుకున్న నానిని ఓడించేంత వరకు విశ్రమించబోమని కూడా వారు శపధం చేశారు. విజయవాడ ఎంపీ సీటు కోసం జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ద్వారా పావులు కదిపి సీటు దక్కించుకోలేక పోయిన పారిశ్రామిక వేత్త పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ) వర్గీయులు, పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు నానిని పార్లమెంట్‌ గడప ఎక్కనీయబోమని శపధం చేశారు. ఆయనను ఓడిస్తామని, లేదా పీవీపీని రెబల్‌గా బరిలోకి దింపేందుకు కూడా వెనుకాడబోమని వారు హెచ్చరిం చారు. ఇక్కడి బందర్‌రోడ్డు లోని ఒక హోటల్‌లో కాపు సంఘం నాయకుడు నరహరిశెట్టి శ్రీనివాసరావు, పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు పొట్లూరి రవి, ఎంఎల్‌ ప్రసాద్‌, మల్లి, దుర్గారావు తదితరులు విలేఖరులతో మంగళ వారం సాయంత్రం మాట్లాడారు. పీవీపీపై వ్యక్తిగత ఆరోపణలు చేసిన నాని వ్యాఖ్యలకు జనసేన అధినేత పవన్‌ కర్ణాటకలో స్పందించారు.పొట్లూరికి సీబీఐ క్లీన్‌ చిట్‌ ఇచ్చిందని చేసిన వ్యాఖ్యలను కూడా వారు ఉదహరించారు. జైళ్లలో ఎక్కువ కాలం గడిపిన వాళ్లే ఎన్నికల్లో పోటీ చేస్తున్నపుడు, ఏ నేరం చేయని వారు పోటీ చేస్తే తప్పేమిటని పవన్‌ ప్రశ్నించిన అంశాన్ని నాయకులు ప్రస్తావిసు,్త బుధవారం నాడు హైదరాబాద్‌లో పవన్‌తో వరప్రసాద్‌ సమావేశ ం అనంతరం తగు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అయితే పీవీపీని రెబల్‌గా బరిలోకి దింపాలన్న అభిప్రాయాన్నే కాపు సంఘం, పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు వ్యక్తం చేయడం గమనిస్తే ఏ క్షణంలోనైనా ఆయన విజయవాడ ఎంపీ బరిలో దిగే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: