నందమూరి బాలకృష్ణ ముఖ్యమంత్రి రేసులో ఉన్నారా..? సీమాంధ్రలో పార్టీ గెలిస్తే సీఎం పీఠంపై కూర్చోవాలని బాలయ్య ఆశలుపెట్టుకున్నారా..? తాజా పరిణామాలు చూస్తుంటే అలాగే కనిపిస్తున్నాయి. తాజాగా అనంతరపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం బాలకృష్ణ మాట్లాడారు. ఏవో పదవులు ఆశించి తాను రాజకీయాల్లో రాలేదని, ముఖ్యమంత్రిగా చేసేందుకు అవకాశం వస్తే మాత్రం కాదనని బాలయ్య మనసులో మాట చెప్పారు. నామినేషన్ వేయడానికి వెళ్తున్న సమయంలో బాలయ్యతోపాటు భారీ సంఖ్యలో పాల్గొన్న నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు 'బాలయ్య సీఎం' అంటూ నినాదాలు చేశారు. నామినేషన్ ఆనంతరం కూడా సీఎం ఛాన్స్ వస్తే చేస్తానని మనసులో మాట చెప్పడం కూడా బాలయ్య సీఎం రేసులో ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఇటీవల 'లెజెండ్' సినిమా విజయయాత్రలో భాగంగా వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడే బాలయ్య.. కర్నూలులో తన మనసులో మాట బయటపెట్టారు. అభిమానులు తనను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారని, ఈ ఎన్నికల్లో హిందూపురం నుంచి శాసనసభకు పోటీచేస్తానని ప్రకటించారు. దీంతో టీడీపీ సీమాంధ్ర సీఎం అభ్యర్థిపై హాట్ టాపిక్ గా మారింది. మరి హిందూపురం నుంచి బాలయ్య భారీ మెజార్టీతో గెలవడం సింఫుల్.. ఈ నేపథ్యంలో బాలయ్య భవితవ్యం హాట్ టాపిక్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: