రఘురామకృష్ణం రాజు... మొదట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో బాగా యాక్టివ్ గా పనిచేసిన నేత. అయితే అంతర్గతంగా ఏం జరిగిందో ఏమో కానీ.. ఉన్నట్టుండి రాజు జగన్ పై విరుచుకుపడ్డాడు. వైకాపకాఉ సెలవిచ్చి బయటకు వచ్చేశాడు. బయటకు వచ్చాకా జగన్ పై తీవ్రమైన ఆరోపణలే చేశాడాయన. అదే సమయంలో రాజు భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకొన్నాడు. బీజేపీ జాతీయ అధ్యక్షుడురాజ్ నాథ్ సింగ్ పాదాలపై పడి ఆశీర్వాదం తీసుకొని మరీ బీజేపీలోచేరిపోయాడు రఘురామకృష్ణం రాజు. అయితే ఇప్పుడు బీజేపీలో ఆయనకు అనుకొన్న లక్ష్యం నెరవేరేలా కనపడటం లేదు. ఆయన పోటీ చేయాలనుకొంటున్న నియోజకవర్గపు సీటు దక్కేలా లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ లోనైనా బీజేపీ ద్వారా నైనా నర్సాపురం నుంచి ఎంపీ గా పోటీ చేయాలని రఘురామకృష్ణం రాజు భావించాడు. అయితే ఇప్పుడు ఆ అవకాశం పూర్తిగా చేజారింది. నర్సాపురం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గోకరాజు గంగరాజును ప్రకటించింది భారతీయ జనతా పార్టీ. దీంతో రఘురామకృష్ణం రాజుకు మిగిలింది నిరాశమాత్రమేనని తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం ల మధ్య పొత్తు కుదిర్చేందుకు కూడా రఘురామకృష్ణం రాజు తీవ్రంగా ప్రయత్నించాడు. సీమాంధ్రలో బీజేపీకి తెలుగుదేశంతో పొత్తు ఉండాలని తీవ్రంగా డిమాండ్ చేసిన వాళ్లలో ఈయన కూడా ఒకరు. అయితే అంత జేసినా ఇప్పుడు అనుకొన్నది అయితే జరగడం లేదు. ఇప్పుడు రఘురామకృష్ణం రాజుపరిస్థితి రెంటికీ చెడ్డ రేవడీగా తయారైంది. మరి ఇప్పుడు ఆయన బీజేపీలోనైనా సైలెంట్ గా ఉంటాడా? లేక ఏదో ఒక గొడవ పెట్టుకొని తిరిగి వేరే దిక్కును ఏమైనా చూసుకొంటాడా ? అనేది శేషప్రశ్న!

మరింత సమాచారం తెలుసుకోండి: