సార్వత్రిక ఎన్నికలకు దూరంగా ఉంటామని గతంలో ప్రకటించిన జనసేన అధ్య క్షుడు పవన్‌ కళ్యాణ్‌ పార్టీ తరపున ఐదారు అసెంబ్లి నియోజక వర్గాల్లో అభ్యర్ధులను నిలబెట్టాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలు స్తోంది. విజయవాడ లోక్‌సభకు తాను ప్రతిపాదించిన పొట్లూరి వరప్రసాదరావు(పివిపి)ను కాదని కేశినేని నాని అభ్యర్ధిత్వాన్ని ఖరారుచేయడంపట్ల తెదేపా అధినేత చంద్ర బాబుపై పవన్‌కళ్యాణ్‌ గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగు తోంది. దీంతో ఆయన పివిపితోపాటు మరికొంతమందిని స్వతంత్ర అభ్యర్ధులుగా బరిలోకి దింపాలన్న నిర్ణయానికి వచ్చారు. తాను పోటీకి పెట్టే కొంతమంది అభ్యర్ధులను బుధ వారం తన నివాసానికి పిలుపించుకున్న పవన్‌కళ్యాణ్‌ వారితో సమావేశమయ్యారు. శుక్రవారం సాయంత్రంలోపు కనీసం ఏడుగురు అభ్యర్ధులతో నామినేషన్‌లు దాఖలుచేయించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. తెలుగుదేశం, భార తీయ జనతాపార్టీలకు మద్దతునిస్తూనే జనసేన పార్టీ తరపున ఏడుగురు అభ్యర్ధులను పోటీకి పెట్టాలని ఆయన భావిసు ్తన్నారు. తూర్పుగోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో ఈ స్వతంత్ర అభ్యర్ధులను పోటీకి పెట్టాలని నిర్ణయించారు. నియో జకవర్గాలను గురువారం మరోమారు సమావేశమై నిర్ణయిం చాలని పవన్‌కళ్యాణ్‌ భావిస్తున్నట్లు సమాచారం. విజయవాడ లోక్‌సభకు పివిపిని బరిలోకి దించాలన్న నిర్ణయం జరిగిందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. మల్కాజిగిరి లోక్‌సభలో లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్‌ నారాయణకు మద్ద తుగా ప్రచారం నిర్వహించాలన్న ఆలోచనతో పవన్‌ కళ్యాణ్‌ ఉన్నారు. ఈమేరకు ఆయన బెంగళూరులో ప్రకటన కూడా చేశారు. పొట్లూరి అభ్యర్ధిత్వంపట్ల సానుకూలంగా ఉన్న ఆయ న కేసులున్నవారు పోటీచేస్తే తప్పేమిటని పవన్‌ ప్రశ్నిస్తు న్నారు. సంవత్సరాల తరబడి జైళ్లో ఉన్నవారు బయటకి వచ్చి పోటీచేస్తున్నప్పుడు పివిపి ఎందుకు పోటీచేయకూడదని సన్నిహితులవద్ద ఆయన తన మనసులోని మాటను వ్యక్తం చేసినట్లు సమాచారం. బుధవారం తన నివాసానికి వచ్చిన పొట్లూరితో పవన్‌కళ్యాణ్‌ రెండుగంటలపాటు మంతనాలు సాగించారు. విజయవాడ లోక్‌సభకు స్వతంత్ర అభ్యర్ధిగా బరి లోకి దిగాలని పవన్‌ కోరినట్లు సమాచారం. గురువారం ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: