దేశం అంతట మోడీ గాలి వీస్తుంది, కేంద్రంలో ఎన్డిఏ ప్రభుత్వం వస్తే తమ పార్టీ చక్రం తిపోచ్చు అని భావించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో బిజెపితో పొత్తు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వస్తున్న వార్తల చూసుకుంటే, సీమాంధ్రలో కమలం పార్టీతో పొత్తు వద్దు అని చంద్రబాబు భావిస్తునాడట. పొత్తులో బాగంగా సీమాంధ్రలో బిజెపికి ఐదు పార్లమెంట్ స్థానాలు, 15 లోక్ సభ సీట్లు కేటాయించారు బాబు. అయితే మొదటి నుండి తెలుగు తమ్ముళ్ళు మాత్రం ఈ పొత్తును వ్యతిరేకిస్తూనే ఉన్నారు.  కార్యకర్తలు కూడా లేని కమలం నాయకులు, తెలుగుదేశం నుండి అతిగా సీట్లు ఆశిస్తున్నారని తెలుగు తమ్ముళ్ళు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం, పురంధేశ్వరికి టికెట్ కేటాయించొద్దు అని బాబు చెప్పినప్పటికీ బిజెపి మాత్రం ఆమెకు రాజంపేట టికెట్ ఇచ్చారు. అంతే కాకుండా నర్సాపురం నుండి రఘురామ్ రాజుకు టికెట్ ఇవ్వాలని బాబు కోరిన్నప్పటికి, ఆ స్థానాన్ని గోకరాజు గంగరాజుకు కేటాయించింది కమలం పార్టీ. ఈ పరిణామాలతో కాస్త ఆలోచనలో పడ్డ బాబు ఇక సీమాంధ్రలో సైకిల్ కి కమలంకి దోస్తి కుదరదు అని భావిస్తున్నాడట. దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన గురువారం వేలువడనున్నట్టు సమాచారం. ఇదే నిజం అయితే కమలం పార్టీకి కష్టాలు తప్పవు. మోడీతో కలిసి ప్రచారం చేయాలి అని అనుకున్న బాబు కొత్త మార్గాలు శోధించాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: