కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు ముళ్ల చెట్లు వంటివని, ఆ చెట్లకు నీళ్లు పోస్తే పండ్లు రావని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె చంద్రశేఖర్ రావు అన్నారు. నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ కళాశాల సమీపంలోని మైదానంలో మంగళవారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. మతతత్వ పార్టీలతో పొత్తు పెట్టుకోబోమని తేల్చి చెప్పారు. అంతేకాకుండా నిజాం ఓ సెక్యులర్ రాజు అని, 1920లో మహాత్మాగాంధీ చెప్పారని ఆయన అన్నారు. నిజాం పాలనలో అందరూ మత సామరస్యంతో మెలిగారని అన్నారు. పొన్నాల తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.  సీమాంధ్ర పాలకుల పల్లకీలను మోసి, నెంబర్ 2గా పని చేసిన చరిత్ర పొన్నాలదని, అంతకంటే ఎక్కువగా ఆలోచించే శక్తి పొన్నాలకు లేదన్నారు. తెలంగాణ కోసం ఏళ్ల తరబడి పోరాటం చేసిన తమ పార్టీని గెలిపిస్తేనే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యమని కెసిఆర్ స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: