సీమాంధ్ర లో తెలుగుదేశం, బిజెపిల మధ్య పొత్తు లో కొత్త చిక్కులు వస్తున్నాయి. కొన్ని సీట్ల విషయంలో వచ్చిన తేడా, అభ్యర్ధుల విషయంలో వచ్చిన విబేధాలు పొత్తుపై ప్రభావం పడవచ్చని భావిస్తున్నారు.పొత్తుకు సంబంధించి ఇరు పక్షాల మధ్య ఇప్పటికే వాతావరణం కొంత చెడింది.తాజగా సీమాంద్రలో పొత్తు లేకపోతే బెటర్ అని టిడిపి భావిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు మీడియాకు లీకులు ఇచ్చారు.ఇది బిజెపి కి ఆగ్రహం తెప్పించేదిగా ఉంది.దీనికి అసలు కారణాలపై ఆరా తీస్తే ఒకటి,రెండు విషయాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నరసాపురం సీటు విషయంలో బిజెపి తరపున రఘురామరాజు అభ్యర్ధి అవుతారని టిడిపి ఆశించింది.  ఆ విధంగా ఆపరేషన్ నిర్వహించి ఆయనను వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నుంచి బయటకు తీసుకు వచ్చారు.తీరా బిజెపి తరపున ప్రచారం చేసుకుంటున్న తరుణంలో రఘురామరాజును కాదని మరో పారిశ్రామికవేత్త గంగరాజును బిజెపి రంగంలో దించింది.ఇది ఆర్ఎస్ఎస్ వల్లే జరిగిందని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు.అయితే టిడిపి అదికనాయకత్వానికి, రఘురామరాజుకు ఏర్పడిన సంబంధ బాంధవ్యాల రీత్యా ఆయనకు టిక్కెట్ ఇప్పించవలసిన బాధ్యత టిడిపిపై పడింది.దాంతో ఈ పొత్తు ను ఉంచాలా?వద్దా అన్న చర్చను తెరపైకి తెచ్చారని అంటున్నారు.చంద్రబాబు ఒత్తిడికి తలొగ్గి బిజెపి రఘురామరాజునే తిరిగి అభ్యర్ధిగా నిలబెడితే పొత్తు కు పెద్ద సమస్య ఉండదని ,లేకుంటే కొంత చిక్కు రావచ్చని అంటున్నారు. కాగా రాజంపేట నుంచి కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి పోటీ చేయడం కూడా టిడిపి నాయకత్వానికి అంత ఇష్టం లేదని, అయినప్పట్టికీ ఆ విషయం కన్నా నరసాపురం సీటు సమస్యే ప్రధానంగా ఉందని అంటున్నారు. అలాగే ఆయా చోట్ల ఎమ్మెల్యే సీట్ల విషయం కూడా కొంత ఇబ్బందిగానే ఉంది. బిజెపి బలహీనంగా ఉన్నా,అన్ని జిల్లాలలో సీట్లు ఇవ్వాల్సి రావడం కూడా టిడిపికి చికాకుగా మారింది.ఈ నేపధ్యంలో బిజెపి, టిడిపి పొత్తు ఏమవుతుందా అన్న తర్జనభర్జనలు జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: