వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడిని తీవ్రస్థాయిలో విమర్శించి, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి జగన్ వ్యతిరేకుల చేతిలో అస్త్రంగా మారిన రఘురాకృష్ణం రాజు భారతీయ జనతా పార్టీలో చేరాడు. ఆ పార్టీ తరపున నర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావించాడు. ఆర్థికంగా ఉన్నతస్థాయిలో ఉండి, రాజకీయ పరమైన తెలివి తేటలకు కొదవలేదని రఘురామకు భారతీయ జనతా పార్టీ టికెట్ దక్కడం పెద్ద సంగతేమీ కాదు! అది కూడా తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ అనుకూల మీడియాకు కూడా ఈయన ఇష్టుడే. అయినప్పటికీ ఆయనకు టికెట్ దక్కలేదు. మరి అలాంటి రఘురామకు టికెట్ దక్కకపోవడానికి కారణం ఆర్ఎస్ఎస్ అనే అభిప్రాయం వినిపిస్తోందిప్పుడు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అంటే ఆర్ ఎస్ ఎస్ తీవ్రస్థాయిలో కోపం ఉంది. పొత్తు విషయంలో బీజేపీని మ్యానేజ్ చేసుకోగలిగాడు కానీ ఆర్ఎస్ ఎస్ మాత్రం తెలుగుదేశం అంటే ఆగ్రహంతోనే ఉంది. బాబు రాజకీయాల పట్ల ఆర్ఎస్ఎస్ వ్యతిరేక భావనలో ఉంది. అందులో భాగంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేసే నియోజకవర్గాల్లో ఆ పార్టీని ఓడించే విధంగా ప్రచారం చేయాలని ఆర్ఎస్ఎస్ ఇప్పటికే నిర్ణయించింది. ఇలాంటి వ్యూహంలోనే నర్సాపురం సీటును తెలుగుదేశం పార్టీకి సన్నిహితుడిగా కనిపిస్తున్న రఘురామకృష్ణం రాజుకు దక్కనీయకుండా చేసిందట రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. అక్కడ నుంచి గోకరాజును తెచ్చి ఎంపీ బరిలో నిలిపిలా ఆర్ఎస్ఎస్ వ్యూహం రచించిందని తెలుస్తోంది. ఈ పరిణామంపై తెలుగుదేశం అధినేత ఆగ్రహోద్రిక్తుడు అవుతున్నాడట. బీజేపీతో గేమ్స్ ఆడితే తాను ఆడాలి, సీమాంధ్రలో బీజేపీ తను చెప్పినట్టుగా నడుచుకోవాలని భావిస్తున్న తెలుగుదేశం అధినేత ఇప్పుడు ఆర్ఎస్ఎస్ రాజకీయాలు అంతిమంగా జగన్ కు ప్లస్ అవుతుండటంతో మండి పడుతున్నాడట. అందుకే బీజేపీతో సీమాంధ్రలో పొత్తుకు కటిఫ్ చెబుతాను అని హెచ్చరించాడట. మొత్తానికి బీజేపీ, టీడీపీల పొత్తులో ఆర్ఎస్ఎస్ పాత్ర ఆసక్తికరంగా మారింది. ఇది ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో!

మరింత సమాచారం తెలుసుకోండి: