దేశంలోని అన్ని రాజకీయ పార్టీలో దాదాపుగా సినిమా వారు ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులో సినీ తారలు రాజకీయాల్లో యాక్టివ్‌ రోల్‌ పోషిస్తున్నారు. టాలీవుడ్‌కు చెందిన ఎన్టీఆర్‌ తెలుగు దేశం పార్టీని స్థాపించి ముఖ్యమంత్రిగా చేశాడు. ఆ తర్వాత ఎందరో ఆయనను ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఆయనంతగా సక్సెస్‌ కాలేక పోయారు. ఇక టాలీవుడ్‌ మెగా స్టార్‌ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీతో సంచలనం సృష్టిస్తా అంటూ వచ్చాడు. అయితే ఆయన పార్టీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుపొందక పోవడంతో తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశాడు. తాజాగా ఈసారి ఎన్నికల్లో కూడా సినీ ప్రముఖుల హడావుడి ఎక్కువగా కినిపిస్తోంది. పలువురు స్టార్‌ ఎన్నికల బరిలో నిలవడంతో పాటు పలు పార్టీల తరపున సినీ సెలబ్రెటీలు ప్రచారం చేస్తున్నారు. టాలీవుడ్‌ పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ తాజాగా జనసేన పార్టీ పెట్టి ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేస్తున్న విషయం తెల్సిందే. ఇక మహేష్‌బాబు కూడా తెలుగు దేశం పార్టీ తరపున ప్రచారం చేస్తాడు అని అనుకుంటున్నారు. అన్ని పార్టీలో కూడా సినిమా వారు ఉన్నారు. నా ఒక్క పార్టీలోనే లేరు అని ఇంత కాలంగా బాధ పడుతున్న కిరణ్‌ కుమార్‌ రెడ్డికి ఒక తార దొరికింది. ఈయన ఇటీవలే స్థాపించిన జైసమైక్యాంధ్ర పార్టీలో నటి హేమ చేరింది. ఈమె మండపేట అసెంబ్లీ స్థానం నుండి జేఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతుంది. తాజాగా ఈమె అమలాపురం ఎంపీ స్థానంకు హర్షకుమార్‌ నామినేషన్‌ వేస్తున్న సందర్బంలో ఆయనతో పాటు రోడ్‌ షోలో పాల్గొని హల్‌ చల్‌ చేసింది. ఆ కార్యక్రమంలో ఈమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఈమె ఈనెల 19న మండపేట అసెంబ్లీ స్థానంకు నామినేషన్‌ దాఖలు చేయబోతున్నట్లు స్వయంగా ప్రకటించింది. ఈ సంరద్బంగా హేమ మాట్లాడుతూ.. తాను ఏదో టైమ్‌పాస్‌కు రాజకీయాల్లోకి రాలేదు అని, ప్రజలకు నిస్వార్థంతో సేవ చేసేందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. తనకు ఓట్లు వేసి గెలిపిస్తే మండపేటలోనే నివాసం ఉంటూ ఇక్కడి ప్రజల సాదక బాదకాలు తెలుసుకుని వారికి సేవ చేసుకుంటాను అంటోంది. మరి ఈమెకు మండపేట వాసులు ఒట్లు వేసి గెలిపిస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: