ఎప్పుడు తగ్గాలో తెలిసినోడే గొప్పోడు.. ఇదీ 'అత్తారింటి దారేది' సినిమాలో మంచి క్లిక్ అయిన డైలాగ్. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ అదే విషయం రుజువు చేస్తున్నాడు పవన్. జనసేన పార్టీ తరుపున ఏడు లోక్ సభ స్దానాలకు పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే చివరకు ఎన్నికల్లో పోటీ చేయకూడదని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసి ఓట్లను చీల్చి, ఇతర పార్టీ లను ఇబ్బంది పెట్టడం తనకు ఇష్టం లేదని తొలి నుంచే పవన్ చెబుతూ వస్తున్నాడు. అందుకే పవన్ సేన ఎన్నికల్లో పోటీ చేయటం లేదని సమాచారం. తన అన్నయ్య చిరంజీవి చేసిన తప్పులు పవన్ చేయకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కీలక విషయాల్లో తొందర పడకుండా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు పవన్. ఇటీవల అయితే అనుకోని రాజకీయ పరిణామాల నడుమ తన మిత్రుడు పొట్లూరికి విజయవాడ ఎంపి టికెట్ ను టీడీపీ నుంచి పొందలేక పోవడంతో పవన్ సేన స్వతంత్ర్య అభ్యర్దులు గా బరిలో దిగాలని అనుకోంది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబే స్వయంగా రంగం లోకి దిగి పొట్లూరికి రాజ్యసభ సీటు ఇస్తామని చెప్పడంతో పవన్ సేన ఎన్నికల బరి నుంచి తప్పుకుంది. అంతే కాకుండా స్వతంత్ర్య అభ్యర్దులు గా బరిలో ఉంటే అందరికి ఒకే రకమైన గుర్తులు కూడా రావటం కష్టమేనని భావించిన ఆ పార్టీ నేతలు పోటీ ఆలోచనను విరమించుకోవడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈసారి పోటీ లేదు కనుక బీజేపీకి ప్రచారం చేసి, అవసరమైతే టీడీపీకి కొన్ని చోట్ల ప్రచారం చేయాలని పవన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి పవన్ కు ఇప్పుడు ఏం ఆశించకుండా స్ర్టయిట్ గానే వెళుతున్నాడు. మరి ఎన్నికల తర్వాత పవన్ నిర్ణయాలు ఎలా ఉంటాయాన్నదే ఇప్పుడు హాట్ టాపిక్.

మరింత సమాచారం తెలుసుకోండి: