పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పార్టీ ఆవిర్భావ సభలో పవన్ ప్రసంగం తరువాత, పవన్ కళ్యాణ్ తమకు మద్దతు ఇస్తాడు అని తెలుగు తమ్ముళ్ళు పండగ చేసుకున్నారు. అయితే ఆ ఆశ రాను రాను తగ్గుముఖం పట్టింది. విజయవాడ లోక్ సీటు వివాదం జరిగిన సమయంలో పవన్ కళ్యాణ్ తమకు వ్యతిరేకంగా ప్రచారం చేయకుంటే చాలు అని తెలుగుదేశం పార్టీ నాయకులు భావించారు. అయితే అలాంటి ఒక పరిస్థితే ఇప్పుడు మల్కాజిగిరి లోక్ సభ స్థానంలో చోటుచేసుకుంటుంది. మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మల్లారెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.  అయితే ఇదే స్థానం నుండి లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ కూడా పోటి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ జెపి తరపున ప్రచారం చేస్తాను అని ఇదివరకే ప్రకటించాడు. అయితే పవన్ ప్రకటనతో తెలుగు తమ్ముళ్లలో గుబులు మొదలయ్యింది. మల్కాజ్‌గిరిలో సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న నేపధ్యంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మల్లారెడ్డికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తలుగుదేశం పార్టీ భావిస్తుంది. కానీ పవన్ జెపి తరపున ప్రచారం చేస్తే ఓట్లు చీలి పోయి అది కాంగ్రెస్ పార్టీకి లాబిస్తుందని వారు అంటున్నారట. కానీ పవన్ మాత్రం తాను ఇప్పటికే జెపికి మాట ఇచ్చానని, వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. దీనితో ఈ ప్రాంతంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: