లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హ్యాండిచ్చాడు. జయప్రకాష్ నారాయణ పోటీలో ఉన్నందుకే తాను మల్కాజ్ గిరి నుండి పోటీకి దిగడం లేదని పవన్ కళ్యాణ్ స్వయంగా ఇంతకుముందు ప్రకటించారు. యువకుల ప్రత్యక్ష్యదైవం పవన్ కళ్యాణ్ అని, తన లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలని ఆయన కోరుకోవడం అభినందనీయమని, ఆయన తన తరపున ప్రచారం చేస్తారని మోడీని కలిసిన అనంతరం జయప్రకాష్ నారాయణ ప్రకటించారు. లోక్ సత్తా బీజేపీ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. అయితే తాజాగా ఈ రోజు చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం పవన్ కళ్యాన్ తాను జయప్రకాష్ నారాయణకు మద్దతు ఇవ్వడం లేదని ప్రకటించారు. మల్కాజ్ గిరి లోక్ సభ స్థానంలో తాను ఎన్డీఎ అభ్యర్థి మల్లారెడ్డికి మద్దతు పలుకుతున్నానని, అయితే తనకు జేపీ అంటే అంతులేని గౌరవం ఉందని, పొత్తు ధర్మంలో భాగంగా మల్లారెడ్డికే తన మద్దతు ఉంటుందని ప్రకటించారు. పవన్ ప్రచారం తనకు లాభిస్తుందని అనుకున్న జేపీ ఆశల మీద ఈ ప్రకటన నీళ్లు చల్లింది.

మరింత సమాచారం తెలుసుకోండి: