రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అభ్యర్ధులను గెలిపించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. చంద్రబాబుతో భేటీ అనంతరం బుధవారం ఆయన తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. ఓట్లు చీలకూడదనే ఉద్దేశంతోనే తాను ఎన్నికలలో పోటీ చేయలేదని చెప్పారు. ఎన్ డిఎ కూటమికి తాను మద్దతు పలుకుతున్నానని చెప్పారు. తెలంగాణలో బిసి ముఖ్యమంత్రిని నియమిస్తామని టిడిపి అధినేత చంద్రబాబు చెప్పడం మంచి పరిణామమని అన్నారు. బిసిలు ఉన్నత స్ధితిలో ఉండాలన్నది తన అభిమతమని చెప్పారు. పార్టీలు, నాయకులు వ్యక్తిగత దూషణలకు దిగకుండా ప్రజా సమస్యల గురించి మాట్లాడాలని సూచించారు. అంతిమంగా ప్రజలకు న్యాయం జరగాలని అన్నారు. రెండు ప్రాంతాల్లో బలమైన ప్రభుత్వం రావాల్సిన అవసరముందని చెప్పారు. జాతీయ నేతలను కేసీఆర్ తిట్టడం మంచిదికాదన్నారు. నేతలను తిట్టడం ద్వారా టీఆర్ఎస్ కు ఎటువంటి లాభం జరగదని హితవు పలికారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న బిసి నేత శ్రవణ్ కు టీఆర్ఎస్ అన్యాయం చేసిందన్నారు. కుటంబపాలన వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి మేలు జరగదని అన్నారు. పరిస్ధితులను బట్టి చంద్రబాబుతో కలిసి ప్రచారం చేస్తానని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: