తెలంగాణాలో నిన్న పలు సభల్లో ప్రసంగించిన బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ ప్రసంగంమంతా తప్పులతడకగా సాగడంతో కూటమి నేతలు, శ్రేణులను అయోమయంలో పడేసింది. అయితే ఈ ఘటనలు నరేంద్ర మోడీకి చరిత్రపై గట్టి పట్టు లేదన్న ఆరోపణలను నిజం చేసినట్లైందని ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక వెల్లడించింది. తెలంగాణాలో 1,100 మంది యువకులు (తెలంగాణా కోసం) పోలీసు కాల్పుల్లో మరణించారని మోడీ చెప్పడం నిజం కాదు. “1,100 మందిని పొట్టనపెట్టుకున్నది ఎవరు? వారిపై కాల్పులు జరిపి, వారిలో బుల్లెట్లు దింపింది ఎవరు?” అని మోడీ తీవ్ర స్వరంతో ప్రశించారు. నిజానికి తెలంగాణాలో చనిపోయిన వారందరి మరణాలు ఆత్మహత్యలే. టీఆర్ఎస్ గాని ఇంకే ఇతర రాజకీయ పార్టీగాని పోలీసు కాల్పుల్లో చనిపోయారని ఎప్పుడూ చెప్పలేదు. ఈ విషయం మోడీకి తెలియకపోవడం అవమానమే. మోడీ అక్కడితో ఆగిపోలేదు…దివంగత మాజీ ముఖ్యమంత్రి టి. అంజయ్యను ‘దళిత ముఖ్యమంత్రి’ అంటూ సంభోదించడంతో ప్రజలు నివ్వెరపోయారు. దళితుడైన టి. అంజయ్యను 1981లో అప్పటి కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రాజీవ్ గాంధీ బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో అవమానించాడని మోడీ పేర్కొన్నారు. అంజయ్య ‘రెడ్డి’ వర్గానికి చెందిన వాడని మోడీకి తెలియకపోవడం ఘోరమని, ఇలా ఆయనకు స్పీచ్ రాసిచ్చిన బీజేపీ నాయకులు తెలుగుప్రజలను అభాసుపాలు చేయడం తగదని తీవ్రంగా విమర్శలొచ్చాయి. గతంలో మహాత్మాగాంధీ పేరును కూడా మోడీ సరిగ్గా చెప్పలేకపోవడం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. గాంధీ పేరును మోహన్ దాస్ కరంచంద్ గాంధీ అని కాకుండా ‘మోహన్ లాల్ కరంచంద్ గాంధీ’ అని సంభోదించి విమర్శాలను ఎదుర్కొన్నారు. ఇక జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావిస్తూ, ఇటు తెలంగాణ, అటు సీమాఃంధ్ర కలిపి మొత్తం తెలుగు స్పూర్థిని పవన్ కళ్యాణ్ రక్షించగలడు అని మోడీ వ్యాఖ్యానించడం ఎబ్బెట్టుగా ఉంది. నిన్నటివరకు సినిమాల్లో నటించిన పవన్ ను పట్టుకుని ‘తెలుగుజాతి స్పూర్తిని రక్షిస్తాడని’ మోడీ చెప్పి కాస్త ఎక్కువే చేశాడనే విమర్శలొస్తున్నాయి. పార్టీ స్థాపించి టికెట్ల కొరకు డ్రామా నడిపి ఓ వర్గానికి కొమ్ముకాస్తున్న పవన్ ఏ విధంగా ‘స్ఫూర్తి’ ఇస్తాడో మోడీ చెబితే బాగుండేడని ఒక ప్రముఖ పాత్రికేయుడు వ్యాఖ్యానించారు!

మరింత సమాచారం తెలుసుకోండి: