అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం పై చాలా రోజులుగా ఆశలుపెట్టుకొన్నాడు కడపల మోహన్ రెడ్డి. వైఎస్ కు సన్నిహితుడిగా, వైఎస్ కుటుంబానికి బంధువుగా పేరున్న కడపల మున్సిపల్, జడ్పీ ఎన్నికలప్పుడు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గపు ఇన్ చార్జిగా ఉన్నాడు. ఆయన పేరు మీదే బీఫారాలు వెళ్లాయి. అయితే అనూహ్యంగా అభ్యర్థుల ప్రకటన సమయంలో ఇక్కడ నుంచి సోమశేఖర్ రెడ్డి పేరు వినిపించింది. ఆయనే అభ్యర్థి అయ్యాడు. దీంతో కడపల రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేశాడు. ఇక ప్రకాశం జిల్లా కనిగిరిలో ముక్కు కాశిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున తొలి నుంచి పనిచేస్తున్నాడు. అయితే ఇక్కడ ఆయనకు పార్టీ టికెట్ దక్కేలేదు. దీంతో ఆయన కూడా రెబెల్ గా నామినేషన్ వేశాడు. మీటింగులు పెట్టి మరీ వైకాపాను ఓడిస్తానని అన్నాడు. అయితే అనూహ్యంగా ఈ రెండు నియోజకవర్గాల్లోనూ రెబెల్స్ నామినేషన్లు ఉపసంహరించుకొన్నారు. జగన్ మోహన్ రెడ్డి ఆ ఇద్దరు నేతలతో మాట్లాడి నామినేషన్లను ఉపసంహరింపజేసినట్టు తెలుస్తోంది. ఈ విధంగా జగన్ మోహన్ రెడ్డి చొరవ చూపి రెబెల్స్ ను అడ్డు తొలగించుకోగా మరోవైపు భారతీయ జనతా పార్టీకి వణుకు పుట్టిస్తున్నారు తెలుగుదేశం రెబెల్స్. బీజేపీకి మిగిలిన 11 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్లు నామినేషన్లు వేశారు. భాజపా అభ్యర్థుల్లో వాళ్లు రైళ్లు పరిగెత్తిస్తున్నారు. అలాంటి వారిని తప్పించడానికి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి పెద్దగా ప్రయత్నాలు జరగడం లేదు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ రోజే ుదిగడువు. స్వయంగా తెలుగుదేశం అధినేతే కొంతమంది రెబెల్స్ కు బీఫారాలు ఇచ్చాడు. దీంతో వాళ్లు ఇప్పుడు పోటీ నుంచి విరమించుకోవడం కష్టమేనని తెలుస్తోంది. మరి బీజేపీ, టీడీపీకి ఇచ్చిన సీట్లల్లో అధికారికంగా, అనధికారికంగా టీడీపీ అభ్యర్థులు పోటీ లో ఉండటం అయితే ఖాయంగా కనిపిస్తోంది!

మరింత సమాచారం తెలుసుకోండి: