నందమూరి ఫ్యామలీ పాలిటిక్స్ హాట్ హాట్ గా మారిపోయాయి. రోజురోజుకు అబ్బాయ్ పై బాబాయ్ చేస్తున్న కామెంట్స్ వారిద్దరి మధ్య మరింత దూరాన్ని పెంచేస్తున్నాయి. ప్రచారం చేయాలనుకున్న వారెరికీ బొట్టుపెట్టుపిలవమని కీలక వ్యాఖ్యలు చేసి 24గంటలు గడవక ముందే బాలయ్య బాబు అబ్బాయ్ పై మరో సెటైర్ వేశారు.జూనియర్ కు టీడీపీ అవసరమోలేదోనని హాట్ కామెంట్స్ చేశారు. అయితే బాబాయ్ జోరుకు కళ్లెం వేసేందుకు అబ్బాయ్ కూడా రెడీ అవుతున్నట్లు సమాచారం. ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన తర్వాత జోరుమీదున్న బాలయ్య బాబు మీడియా ముందే తొడలుగొడుతున్నారు. ప్రచారానికి ఎవర్నీ బొట్టుపెట్టి పిలవమన్న మరుసటిరోజే.. తన వాయిస్ ను మరింతగా పెంచేశారు. జూనియర్ నే కాదు. హరికృష్ణ ను కూడా ప్రచారం చేయమని అడగలేదన్న బాలయ్య.. ఎన్టీఆర్ కు టీడీపీ అవసరం లేదేమోనని హాట్ కామెంట్స్ చేశారు. గతంలో బాద్ షా చెప్పిన డైలాగ్ లు గుర్తుకొచ్చేలా సెటైర్లు వేస్తూనే.. ఎవరి పైనా ఒత్తిడి చేయడంలేదన్నారు. విజయనగరం జిల్లాలో ప్రచారంలో నిర్వహించిన బాలయ్య.. జూనియరే టార్గెట్ గా ప్రసంగించారు. తన సోదరి దగ్గుబాటి పురంధేశ్వరి నియోజకవర్గం రాజంపేటలో ప్రచారం చేయడం లేదన్న లెజెండ్.. హిందూపురంలో భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. బాలయ్య హాట్ కామెంట్స్ తో జూనియర్ కూడా స్పందించనున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం, బిజెపి కూటమి ఎన్నికల ప్రచారానికి ఎన్టీఆర్ సిద్ధమైనట్లు సమాచారం. ప్రచారానికి సంబంధించిన రూట్ మ్యాప్ ను కూడా జూనియర్ సిద్ధం చేసినట్లు సన్నిహితులు చెబుతున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ టిడిపి-బిజెపిలకు స్టార్ క్యాంపైనర్‌గా ఉంటానంటూ చెప్పిన కొద్ది గంటలలోనే జూ. ఎన్టీఆర్ టిడిపి తరఫున ప్రచారం చేయడానికి సిద్ధమైనట్లు వార్తలు రావడం ఆసక్తికరంగా మారింది. ప్రచారంపై జూనియర్ ఇష్టమని బాలయ్య చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారడంతో తెలుగుతమ్ముళ్లలో కూడా ఎన్టీఆర్ పైనే చర్చ జరుగుతోంది. బాబాయ్ తో పాటు అబ్బాయ్ కూడా ప్రచారానికి వస్తే కేడర్ లో నూతనోత్తేజం వస్తుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు నారావారి కుటుంబ సభ్యులు కూడా ప్రచారానికి రెడీ అవుతున్నారు. చంద్రబాబు సోదరుడి కుమారుడు నారారోహిత్ సీమాంధ్రలో ప్రచారానికి ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ నెల 25న గుంటూరు, విజయవాడ, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో, 26న విశాఖపట్నం, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాల్లో, 27న అనంతపురం, తిరుపతిలలో ప్రచారం నిర్వహించేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: