తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఉవ్వెత్తున సాగిన ఉత్తర తెలంగాణ ప్రాంతంపై కాంగ్రెస్‌ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో పట్టు సాధించేందుకు ప్రధాన దృష్టిని సారించింది. తెలం గాణ రాష్ట్ర సాధన తమ ఉద్యమంతోటే సాధ్యపడిం దని టీఆర్‌ఎస్‌ ప్రచారం సాగిస్తూ ఆ ప్రాంతంలో లబ్ధి పొందేందుకు చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేం దుకు సర్వశక్తులను ఒడ్డాలని నిర్ణయించింది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అంతగా పట్టులేని టీఆర్‌ఎస్‌, ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే అత్యధిక లోక్‌సభ, శాసనసభ స్థానాలను దక్కించుకోవాలనే వ్యూహంతో ఆయా జిల్లాల్లో ఉవ్వెత్తున ప్రచారాన్ని కొనసాగిస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ఈ ప్రాంతం నుంచి పార్టీకి చెందిన ముఖ్యనేతలు హరీష్‌రావు, కల్వకుంట్ల తారక రామా రావు తదితరులను బరిలోకి దింపిన తెలంగాణ రాష్ట్ర సమితి అత్యధిక స్థానాలను ఈ ప్రాంతం నుంచి గెలుచుకోవాలనే లక్ష్యంతో పావులు కదుపుతోంది. వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాల్లో చావోరేవో తేల్చుకునేందుకు సిద్ధ మంది. తెరాస వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు కత్తులు నూరుతోంది. తెలంగాణ కాంగ్రెస్‌ ఉత్తర తెలం గాణలో తెరాసను ఢీ కొనేందుకు ప్రత్యేక వ్యూహంతో అడుగులు వేస్తూ పరిస్థితిని తమకు అనుకూలంగా మల్చుకునేందకు అవిరామంగా శ్రమిస్తోంది. దక్షిణ తెలంగాణలోని జిల్లాలలో పట్టు కలిగిన కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలతో ఈ ప్రాంతంలో కాకుండా ఉత్తర తెలంగాణలో వారితో బహిరంగ సభలను ఏర్పాటుచేస్తూ ఆ ప్రాంత ఓటర్లను ఆకట్టుకునేందుకు అధిక ప్రాధాన్యతను కనబరుస్తోంది. ఇందులో భాగంగా కరీంనగర్‌లో పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో బహిరంగసభను ఏర్పాటుచేసిన తెలంగాణ కాంగ్రెస్‌ ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సభను కూడా ఈ ప్రాంతంలోని నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం సాంపల్లిలో ఇటీవల ఏర్పాటు చయించిన విషయం తెలిసిందే. దక్షిణ తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లో ఏర్పాటైన ఎన్నికల ప్రచారసభల్లో కూడా పాల్గొన్న రాహుల్‌గాంధీ ఈ నెల 25న మరోసారి తెలంగాణలో పర్యటించేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. ఆ రోజున వరంగల్‌లో సాయంత్రం 4 గంటలకు, హైదరాబాద్‌ లో సాయంత్రం 6 గంటలకు జరగనున్న ప్రచార సభల్లో పాల్గొననున్నారు. ఇదిలా ఉండగా ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ కూడా తెలంగాణలో ఎన్ని కల ప్రచారానికి రానున్నారు. ఈ నెల 26వ తేదీన నల్గొండ జిల్లా భువనగిరిలో మధ్యాహ్నం 2 గంటకు ఏర్పాటుకానున్న ఎన్నికల ప్రచారసభల్లో పాల్గొని ప్రజలను ఉద్ధేశించి ప్రసంగించనున్నారు. అనం తరం హైదరాబాద్‌కు చేరుకొని ఇక్కడ ఏర్పాటుకా నున్న విలేకరుల సమావేశంలో ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పాల్గొననున్నారు. పార్టీ అగ్రనేతల ఎన్నికల ప్రచార సభలు టీ కాంగ్రెస్‌ నేతలలో నూతనోత్సహాన్ని నింపు తున్నాయి. మరోపక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్‌ పార్టీనే అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతూ విపక్షాల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగిసే సమయం మరో ఐదురోజులే ఉండడంతో ఉత్తర తెలంగాణలో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసే దిశగా టి.కాంగ్రెస్‌ నేతలు అడుగులు వేస్తున్నారు. ఇకపోతే పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఈ నెల 27న రాష్ట్రంలో మరోసారి పర్యటించి ఎన్నికల ప్రచారసభల్లో పాల్గొననున్నారు. ఆ రోజున మెదక్‌లో సాయంత్రం 3గంటలకు ఏర్పాటుకానున్న సభలో పాల్గొని ఆమె ఆ ప్రాంత ప్రజలను ఉద్ధేశించి ప్రసంగించనున్నారు. సోనియా ప్రచారాన్ని ఉత్తర తెలంగాణకు మాత్రమే టి. కాంగ్రెస్‌ నేతలు పరి మితం చేసిన తీరును గమనిస్తే ఈ ప్రాంతంపై పట్టును మరింతగా సాధించేందుకు పార్టీ నేతలు తపిస్తున్న తీరు స్పష్టమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: