ఓరుగల్లు జిల్లా చూపు పాలకుర్తిపై పడింది. రాజకీయాల్లో రాటుదేలిన ఎర్రబెల్లి దయాకర్‌రావు పరిస్థితి ఏమిటన్నదే చర్చ. 1994 నుండి ఎదురులేకుండా రాణిస్తున్న దయాకర్‌రావు తన వ్యూహాలకు పదును పెడుతున్నా టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నుండి గట్టి అభ్యర్థులు పోటీలో ఉండడంతో ఎదురీదాల్సిన పరిస్థితి నెలకొంది. దయాకర్‌రావు తన సొంత బలాన్నే నమ్ముకోగా టిఆర్‌ఎస్‌ అభ్యర్థి నెమురుగొమ్ముల సుధాకర్‌రావు తెలంగాణ సెంటిమెంట్‌పై ఆశలు పెట్టుకున్నారు. ప్రజలు కాంగ్రెస్‌ను విశ్వసిస్తారన్న గట్టి నమ్మకంతో కాంగ్రెస్‌ అభ్యర్థి దుగ్యాల శ్రీనివాసరావు ఉన్నారు.  ఎర్రబెల్లి ఎదురీత ఎర్రబెల్లి 1994లో వర్ధన్నపేట నుండి పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి వరద రాజేశ్వర్‌రావుపై గెలుపొందారు. 1999, 2004లోనూ గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజనలో వర్ధన్నపేట 2009లో ఎస్సీలకు రిజర్వుడ్‌ కావడంతో పాలకుర్తిపై కన్నేసి టిడిపి, టిఆర్‌ఎస్‌ల పొత్తుల్లో భాగంగా దయాకర్‌రావు పాలకుర్తి నుండి పోటీ చేసి గెలుపొందారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో టిడిపి తెలంగాణ ఫోరం కన్వీనర్‌గా పనిచేశారు. పార్టీ కంటే దయాకర్‌రావుకే జనంలో ఆదరణ ఉంది. క్యాడర్‌ను బలోపేతం చేసుకోవడంతో పాటు ట్రస్టు పేర అభివృద్ధి పనులు కూడా చేశారు. టిడిపి రెండుసార్లు అధికారంలోకి రాకపోవడం, తెలంగాణ పట్ల ఆ పార్టీ రెండు కళ్ల సిద్ధాంతం, ఎర్రబెల్లి చేసిన అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉండడంతో ప్రజల్లో వ్యతిరేకత ఉంది. సెంటిమెంటే టిఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆయుధం ఓరుగల్లు జిల్లా చూపు పాలకుర్తిపై పడింది. రాజకీయాల్లో రాటుదేలిన ఎర్రబెల్లి దయాకర్‌రావు పరిస్థితి ఏమిటన్నదే చర్చ. 1994 నుండి ఎదురులేకుండా రాణిస్తున్న సుధాకర్‌రావు 1999లో టిడిపి నుండి చెన్నూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో ఓడిపోయారు. 2009లో టిడిపి టికెట్‌ ఇవ్వకుండా ఎర్రబెల్లికి ఇచ్చింది. ఎన్నికల అనంతరం సుధాకర్‌రావు టిఆర్‌ఎస్‌లో చేరారు. ప్రస్తుతం టిఆర్‌ఎస్‌ నుండి పోటీ చేస్తున్నారు. సెంటిమెంట్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. తన తండ్రి చేసిన అభివృద్ధితో పాటు ఒకసారి ఓడిపోయి మరోసారి టికెట్‌ రాకపోవడంతో ప్రజల్లో సానుభూతి ఉంటుందని భావిస్తున్నారు. అయితే డాక్టర్‌గా నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడే అయినా రాజకీయంగా ప్రజల మన్నలను పొందలేక పోయారు. దుగ్యాలకు రెబల్‌ బెడద దుగ్యాల శ్రీనివాస్‌రావు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. టిఆర్‌ఎస్‌ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరి 2004లో చెన్నూరు నుండి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 'ఆపరేషన్‌ ఆకర్ష్‌'లో భాగంగా కాంగ్రెస్‌లో చేరారు. 2009లో పాలకుర్తి నుండి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయనకు రెబల్‌ బెడద ఉంది. మాజీ జెడ్‌పి ఛైర్మన్‌ ధన్వంతి భర్త డాక్టర్‌ లక్ష్మినారాయణ నాయక్‌ బరిలో ఉన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల మండలానికి చెందిన లక్ష్మినారాయణకు ఎస్టీ ఓటర్ల బలం ఉంది. ఈ నియోజకవర్గంలో 37వేల ఎస్సీ ఓట్లు కాంగ్రెస్‌కు ఓటు బ్యాంక్‌గా ఉంది. ఎస్టీ ఓట్లలో సగం ఓట్లు చీల్చినా దుగ్యాల శ్రీనివాసరావు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ముక్కోణపు పోటీలో ఎవరు విజేతో త్వరలో తేలనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: