సీమాంధ్ర సీఎం ఎవరు..? ఇప్పుడిదే స్టేట్ లో పెద్ద హాట్ టాపిక్..! ఏ ఇద్దరిని కదిపినా ఇదే చర్చ.. టీ కొట్లు, పాన్ డబ్బాలు సైతం ఈ చర్చకు వేదికవుతున్నాయి. బెట్టింగ్ రాయుళ్లు సైతం ఫ్యాన్ గాలి వీచిందని.. సైకిల్ రెట్టించిన స్పీడ్ తో దూసుకుపోయిందని దాదాపు రూ. 3600 కోట్ల వరకు పందెలు కాశారు.. అయితే జనం.. జగన్ కు జై కొట్టారో..? లేక నమోచంద్రపవనాలు బలంగా వీచాయో మరో రెండు రోజుల్లో తేలనుంది.. అయితే దానికంటే ముందు ఎగ్జిట్ పోల్ ఏమంటున్నాయి..? పొలిటికల్ కురుక్షేత్రంలో జగన్ అర్జునుడిగా గెలుస్తాడా..? లేక అభిమన్యుడిగా మిగిలిపోతాడా..? అపర చాణుక్యుడు చంద్రబాబు ఈసారైనా చక్రం తిప్పుతాడా..? లేక ఎప్పడిలాగే ప్రతిపక్షంలో కుర్చుంటాడా..? సీమాంధ్ర జిల్లాల వారిగా ఏపీ హెరాల్డ్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ మీకు అందిస్తున్నాం. రాయలసీమలో 54 స్థానాలు వైసీపీ - 33 టీడీపీ - 21 ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో -22 స్థానాలు వైసీపీ - 13 టీడీపీ - 9 గుంటూరు, కృష్ణ జిల్లాల్లో 32 స్థానాలు టీడీపీ 21 వైసీపీ 11 ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాల్లో 34 స్థానాలు టీడీపీ 20 వైసీపీ 14 విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 33 స్థానాలు టీడీపీ 15 వైసీపీ 18 మొత్తం -175 వైసీపీ : 79 నుంచి 115 టీడీపీ : 60 నుంచి 65

మరింత సమాచారం తెలుసుకోండి: