ఒకపక్కన ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్ధిక సమస్యలలో ఉందని నేతలు చెబుతున్నారు. మరో వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఛాంబర్ కోసం పది కోట్లు ఖర్చు చేస్తున్నారన్న వార్త వస్తోంది. అది నిజమే అయ్యే పక్షంలో విమర్శలకు గురి అయ్యే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడే స్వయంగా మంత్రులతో పొదుపు గురించి ఉపదేశం చేశారు.కాని మరి ఆయన ఛాంబర్ కోసం ఇంత భారీ మొత్తం ఖర్చు చేయడం అవసరమా అన్న ప్రశ్న సహజంగానే ప్రత్యర్ధులు వేస్తారు.అంతేకాక, ఖాళీ చేసి వెళ్లవలసిన భవనం కోసం ఇంత మొత్తం ఖర్చు చేయాలా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.  ఒక మీడియాలో వచ్చిన కధనం ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వులలో ఏ ఏ వాటికి ఆ పది కోట్లు ఖర్చు పెట్టాలో కూడా వివరించారు.కాన్పరెన్స్ హాలు, డైనింగ్ హాల్, సందర్శకుల హాల్, మంత్రివర్గ సమావేశ మందిరం,ప్రత్యేక లిఫ్ట్,బులెట్ ఫ్రూప్ అద్దాలు ప్రెస్ కాన్ఫరెన్స్ హాలు ఇలా వివిధ రకాల ఏర్పాట్ల నిమిత్తం పది కోట్లు ఖర్చు చేస్తున్నారు.వీటిలో కొన్ని తప్పనిసరిగా ఖర్చు చేయాల్సినవి ఉండవచ్చు.కాని మరీ పది కోట్లు అనేసరికి కొంత ఎక్కువేమో అనిపిస్తుంఇ.ఇప్పటికే హెచ్ బ్లాక్ లో మూడు కోట్లు(గవర్నర్ పాలన సమయంలో)హెచ్ బ్లాక్ లో ఖర్చు చేశాక,దానిని వదలివేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: