దేశ వ్యాప్తంగా మోడీ హావా నడిచింది. ఒకట్రెండు రాష్ట్రాల్లో మినహా మోడీ ప్రభావం మొన్నీ మధ్య జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కనిపించింది. ఇక తమ రాష్ట్రంలోనూ మోడీ హవా పనిచేయదంటున్నారు ఉత్తరాఖాండ్ సీఎం హరీష్ రావత్. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీనే ప్రజలు తిరిగి గెలిపిస్తారని చెప్పారాయన. తమ ప్రభుత్వంతోనే రాష్ట్రంలో స్టేబుల్ గవర్నమెంట్ వస్తుందని..మిగతా ఏ పార్టీతోనూ అది సాధ్యం కాదన్నారు. గత ఎన్నికల్లో యూపీఏపై ఉన్న వ్యతిరేకతను ప్రచారం చేసుకోని లోక్ సభ ఎన్నికల్లో గెలిచారని విమర్శించారు. గత లోక్ సభ ఎన్నికలకు పూర్తిగా తానే బాధ్యత వహిస్తానని…ఫిబ్రవరిలో తాను అధికారం చేపట్టాటని…తక్కువ టైం ఉండటంతో ఎన్నికలకు ప్రిపేర్ కాలేదన్నారు. ఈ సారి వచ్చే ఎన్నికలు పూర్తి సమయం ఉందని…పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకోస్తామన్నారు. రాహుల్ ఫ్యాక్టర్ గురించి ఆయన మాట్లాడుతూ 2009లో తాము రాహుల్ గాంధీ వల్లే అధికారంలోకి వచ్చామన్నారు. రాష్ట్రంలోని ఎక్కువ మంది యూత్ కాంగ్రెస్ వెంటే ఉన్నారని చెప్పారు హరీష్ రావత్. ప్రజలు కోరుకుంటున్న మార్పు బీజేపీతో సాధ్యం కాదన్న విషయం ప్రజలకు అర్దమైందన్నారు. రైల్వే ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచారని ఆరోపించారు హరీష్ రావత్.

మరింత సమాచారం తెలుసుకోండి: