ఒకవైపు కేంద్ర ప్రభుత్వం యూపీఏ ప్రారంభించిన పథకాల పేర్ల జోలికి వెళ్లము అని స్పష్టం చేసింది. యూపీఏ హయాంలో చాలా ప్రభుత్వ పథకాలకు ఇందిర, రాజీవ్ ల పేర్లు పెట్టారు. ప్రతి పథకానికీ వాళ్ల పేరు పెట్టడంపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. మరి అలాంటి యూపీఏ చేతి నుంచి అధికారం చేజారింది. బీజేపీ చేతిలో పడింది. అయినప్పటికీ తమకు గత ప్రభుత్వ పథకాలు పెట్టిన పేర్లతో సంబంధం లేదని, వాటి అమలుపై మాత్రం జాగ్రత్తలు తీసుకొంటామని ప్రధానమంత్రి మోడీ సెలవిచ్చారు. అయితే సీమాంధ్రలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం కాంగ్రెస్ వాళ్ల పథకాలకు కలరింగ్ వేయడం మొదలు పెట్టింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభం అయిన "అమ్మహస్తం'' పథకానికి పేరు మార్చేశారు. ఈ పథకానికి "ఎన్టీఆర్ ప్రజాపంపిణీ' అంటూ నామకరణం చేశారు. ఈ మేరకు రేషన్ కుపన్లను పసుపు పచ్చ కలర్ లోకి మార్చి, ఎన్టీఆర్ ప్రజాపంపిణీ పేరుతో కూపర్లను జారీ చేయడం కూడా జరిగిపోయింది. అయితే పార్టీలు ఈ విధంగా తృప్తి పొందడం వల్లవచ్చే ప్రయోజనం ఏముంది? వెనుకటికి కిరణ్ కుమార్ రెడ్డి చాలా అడుగులు ముందుకు వేసి "రాజీవ్ యువకిరణాలు'' అంటూ తన పేరును కూడా పథకం పేరులో చేర్చుకొని ఆనందించాడు. ఆ తర్వాత ఆయన అడ్రస్ లేకుండా పోయాడు. ఈ రోజు కాంగ్రెస్ పథకాలకు తెలుగుదేశం వాళ్లు పేర్లు మార్చుకొని ఆనందపడుతున్నారు. మరి రేపు ఇంకొకరు అధికారంలోకి వస్తే అప్పుడు ఈ పేర్లను మార్చేయడం పెద్ద విశేషం కాదు కదా!

మరింత సమాచారం తెలుసుకోండి: