తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవితో సంతోషపడకుండా, జడ్పిఛైర్మన్ పదవిని, చివరికి మండలాధ్యక్ష పదవిని లాక్కోవాలని ప్రయత్నించడం దౌర్చ‌గ్యమని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు, శాసనసభలో విపక్ష నేత జగన్ విమర్శించారు. ఏకంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి జడ్పిటిసీలకు ఫోన్ చేసి ఫిరాయింపులను ప్రోత్సహించితే ప్రజాస్వామ్యం ఎటు పోతుందని ఆయన ప్రశ్నించారు.పార్టీ గుర్తుల మీద ఎన్నికలు జరపడం వల్ల ఉపయోగం ఏమిటని ఆయన అన్నారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కు తెలుగుదేశం ప్రభుత్వం పై ఆయన ఫిర్యాదు చేశారు.పద్దతి ప్రకారం తాము నాలుగు చోట్ల జడ్పిలు గెలవ వలసి ఉండగా ఒక్కదానిని మాత్రం సాధించుకోగలిగామని అన్నారు.పోలీసు అదికారుల సాయంతో జడ్పిటిసీలను బెదిరించి ఎన్నికలు జరగకుండా, లేక కిడ్రాప్ లతో టిడిపి గెలిచిందని అన్నారు. 215 మండలాలు,ముప్పై మున్సిపాల్టీలు తమ పార్టీ గెలుచుకునే అవకాశం ఉన్నా,టిడిపి దౌర్జన్యాలకు పాల్పడి కైవసం చేసుకుందని అన్నారు.విపక్షం గొంతును నొక్కవచ్చని అనుకుంటే మూర్ఖత్వం అని అన్నారు.అబద్దాలు చెప్పి,మోసాలు చేసి గెలిచి ఇప్పుడు ప్రజలను పక్కదారి పట్టించుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు.రుణమాపీ చేస్తామని అబద్దాలు చెప్పారని,అది జరగకపోతే చంద్రబాబు కాలరును ప్రజలే పట్టుకుంటారని ఆయన అన్నారు.ఇంటికో ఉద్యోగం అన్న చంద్రబాబు దానిని నెరవేర్చకపోతే ఆ యువకులే కాలర్ పట్లుకుంటారని జగన్ హెచ్చరించారు.తెలుగుదేశం అదికారంలోకి వచ్చాక పదిహేడు మందిని హత్య చేశారని,వందమందిని గాయపరిచారని అన్నారు.చివరికి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ వారు ఫిర్యాదు చేయబోతే పోలీసులు వాటిని తీసుకోవడం లేదని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: