రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు కరీంనగర్‌ ఎంపీగా ప్రాతినిధ్యం వహిం చిన సమయంలో ప్రతిపాదించిన కొత్తపల్లి - మనోహరాబాద్‌ రైల్వే మార్గానికి ఈసారి బడ్జె ట్‌లో నిధులు కేటాయిస్తారా అన్న దానిపై జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంగళవారం పార్లమెంట్‌ సమావేశాల్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జె ట్‌-2014లో జిల్లాకు సంబంధించి నిధుల కేటా యింపుపై ఉత్కంఠ నెలకొన్నది. టీఆర్‌ఎస్‌కు చెందిన ముగ్గురు ఎంపీలు బోయినపల్లి వినోద్‌ కుమార్‌, బాల్క సుమన్‌, కవిత జిల్లాకు రైల్వే పరంగా కేంద్రం నుంచి అధిక నిధులు కేటా యించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. స్వయంగా ఆనాటి ప్రధానమంత్రి పీవీ నర్సిం హారావు శంకుస్థాపన చేసిన పెద్దపల్లి - జగి త్యాల - నిజామాబాద్‌ రైల్వే మార్గం పనులు రెండు దశాబ్దాలు గడిచినా పూర్తి కాకపోవడం తో రెండు జిల్లాల ప్రజలు తీవ్ర నిరాశకు గుర వుతున్నారు. కేవలం 30కి.మీ. మేరకు రైల్వే లైను నిర్మాణ పనులు పూర్తి చేస్తే ఇందూరు రైలు కూత వేసే అవకాశం ఉన్నందున కొత్త ఎంపీలు ఏడాదికాలంలో ఈ రైలుమార్గం పను లకు మోక్షం కలిగిస్తారని ఆశిస్తున్నారు.  1993 జూన్‌లో ఆనాటి ప్రధాని పీవీ నర్సిం హారావు ఈ రైలుమార్గం పనులకు శంకుస్థాప న చేశారు. 172 కిలోమీటర్ల నిడివి గల రైలు మార్గానికి గాను రెండు దశాబ్దాల కాలంలో కేవలం 134 కిలోమీటర్ల రైలు మార్గం మాత్రం పూర్తి చేశారు. ఈ రైలుమార్గం మీదుగా జగి త్యాల నుంచి పెద్దపల్లి వరకు ప్యాసింజర్‌ రైలు ను నడిపిస్తున్నారు. జగిత్యాల నుంచి మోర్తా డు వరకు రైలుమార్గం పూర్తయి ట్రయల్‌ రన్‌ నిర్వహించినా ఇప్పటివరకు రైలును నడిపించ డం లేదు. ఇప్పుడు కేవలం సుమారు 30 కిలో మీటర్ల రైలు మార్గం పనులు పూర్తి చేయాల్సి ఉన్నది. దీనికోసం సుమారు 200 కోట్ల రూపా యలు అ వసరం కాగా ఏ బడ్జెట్‌లో కూడా పూర్తి మొత్తాన్ని కేటాయించని కారణంగా ని ర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ బడ్జెట్‌లోనైనా దీనికి అ వసరమైన మొత్తం నిధులు కేటాయించి పనులు పూర్తయ్యేలా చూస్తారని కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల ప్రజలు ఆశిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కేసీ ఆర్‌ తాను కరీంనగర్‌ ఎం పీగా ప్రాతినిధ్యం వహించిన సమయంలో ప్రతిపాదించిన కొత్తప ల్లి- మనోహరాబాద్‌ రైలు మార్గం పనులకు కూడా నిధుల మంజూరీ చేయించాల్సి ఉన్నది. కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి -సిరిసిల్ల - సిద్దిపేట మీదుగా సికింద్రాబాద్‌ సమీపంలోని మనోహ రాబాద్‌ వరకు ఈ రైల్వే లైను నిర్మాణాన్ని కేసీఆర్‌ ప్రతిపాదించారు. దీంతో కరీంనగర్‌, మెదక్‌ జిల్లాల ప్రజలకు హైదరాబాద్‌తో రైల్వే కనెక్టివిటీ లభిస్తుంది. 2006-07లో ఎంపీ కేసీ ఆర్‌ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఆమో దించి ఈ మార్గాన్ని మంజూరు చేసింది. 151 కిలోమీటర్ల నిడివి గల ఈ రైలుమార్గం కోసం సర్వే పూర్తి చేయించి రైల్వే బడ్జెట్‌లో నిధులను మంజూరు చేసింది. 975 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ మార్గాన్ని నిర్మించదలి చినా 2013-14లో కేవలం 20 కోట్ల రూపాయ లు కేటాయించారు. కంటి తుడుపు నిధులతో పనులు చేపట్టినా వందేళ్ళయినా ఈ మార్గం పూర్తయ్యే అవకాశం లేనందున అవసరమైన నిధులను కేటాయించి నిర్ణీత కాలవ్యవధిలో రైలుమార్గం పనులు పూర్తి చేయించాలని ప్రజ లు కోరుతున్నారు. ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వ రంగల్‌, ఖమ్మం కోల్‌బెల్ట్‌ ప్రాంతాలను కలు పుతూ రైలుమార్గం వేయాలనే ప్రతిపాదన వ చ్చి రామగుండం- మణుగూరు రైలు మార్గాన్ని సర్వేకు ఆదేశించారు. 180కి.మీ. నిడివి గల ఈ రైల్వే మార్గం నిర్మాణం కోసం సర్వేకు ఆదేశిం చింది. గత బడ్జెట్‌లో సర్వేకు కేటాయించిన నిధులు కూడా మంజూరు చేయకపోవడంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే అన్న ట్టుగా ఉంది. కరీంనగర్‌ నుంచి హుజురాబాద్‌ మీదుగా హసన్‌పర్తి వరకు కొత్త రైలుమార్గం కోసం గత ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ప్రతిపాదిం చారు. ఇందుకోసం సర్వే చేయాలని కేంద్ర ప్ర భుత్వం ఆదేశించినా ఏ మాత్రం కదలిక లేకుం డా పోవడంతో ఈ మార్గంపై ప్రజలు ఆశలు వదులుకుంటున్నారు. కొత్త రైలుమార్గాల ప్రతి పాదనలు ఎలా ఉన్నా కనీసం చివరి దశలో ఉన్న ఇందూరు రైలుమార్గాన్ని ఈ ఏడాదైనా పూర్తి చేయించడం, కొత్తపల్లి - మనోహరాబా ద్‌ మార్గం పనులకు శ్రీకారం చుట్టేలా జిల్లా ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని జిల్లా ప్ర జలు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: