ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా తెలంగాణలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు ఆయన ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో కేసీఆర్‌ను సోమవారం కలసిన సందర్భంగా అభినందించారు. తన తండ్రి అంబానీ వలే క్రిందిస్థాయి నుంచి కష్టపడి పెకైదిగినట్లే... కేసీఆర్ కూడా అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రాన్ని సాధించారని అనిల్ కొనియాడారు. తెలంగాణ పునర్నిర్మాణంలో తమవంతు పాత్ర పోషిస్తామని హామీనిచ్చారు. విద్యుత్, మౌలిక సదుపాయాలు, పారిశ్రామికీకరణ, మీడియా రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇందుకు కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించే పనిలో ఉన్నామని... ఇది పూర్తయిన తర్వాత మరోసారి చర్చలు జరిపి సహకరించుకుందామని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు, చీఫ్ సెక్రటరీ రాజీవ్‌శర్మ పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: