డాక్టర్ వైెఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా  2004 నుండి 2014 వరకు నిరాటకంగా కొనసాగించారు. తను కొనసాగించిన ప్రభుత్వ పథకాలతో ఆంధ్రప్రదేశ్ లో రెండు పర్యాయాలు కాంగ్రెస్ ను గెలిపించారు.  కానీ  అనుకోగని ఘటనలో ఆయన అకాల మరణానికి గురైనారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్   ముఖ్యమంత్రులుగా రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు వచ్చినప్పటికీ వారి హాయంలో కాంగ్రెస్ పాటన అస్తవ్యస్తంగాసాగింది. ఒక దశలో  రాష్ట్రం అల్లకల్లోలం అయ్యింది. ఒక వైపు తెలంగాణ ఉద్యమం మరో వైపు సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి దీంతో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జనం చాలా ఇబ్బంది పడ్డారు.   అయితే డాక్టర్ రాజశేకర్ రెడ్డి బతికి ఉన్న సమయంలో  ప్రభుత్వ హయాంలో కేటాయించిన భూములపై కొరడా జులిపించడానికి  ఇప్పటి   ప్రభుత్వం సిద్ధమైంది. యనమల రామకృష్ణుడి నేతృత్వంలోని ఈ కమిటీ సోమవారం సమావేశమైంది. వైయస్ ప్రభుత్వం కొన్ని కంపెనీలకు అక్రమంగా లక్ష ఎకరాలను కేటాయించిన భూముల చంద్రబాబు ప్రభుత్వం అనుమానిస్తోంది. కమిటీ సభ్యుడు పల్లె రఘునాథ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీమాంధ్ర, తెలంగాణల్లో వైయస్ ప్రభుత్వం వివిధ కంపెనీలకు లక్ష ఎకరాలు అక్రమంగా కట్టబెట్టిధని ఆరోపించారు. అనంతపురం జిల్లాలోని గోరంట్ల మండలం లేపాక్షి కంపెనీకి 2008లో లేపాక్షి నాలెడ్జి హబ్ కోసం 8830 ఎకరాలను గత వైయస్ ప్రభుత్వం కేటాయించింది. ఆరేళ్లు గడిచినా ప్రాజెక్టు పనులు ప్రారంభం కాలేదు. కమిటీ సమావేశంలో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. కోటి రూపాయలు మాత్రమే ఖర్చు చేసి లేపాక్షి హబ్‌కు కేటాయించిన భూములను గత ప్రభుత్వం ఈ భూములను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించింది. భూకేటాయింపులో వైయస్ ఏ విధమైన నిబంధనలను కూడా పాటించలేదని ఆయన విమర్సించారు. అధికారులను అడిగితే తమ వద్ద ఏ విధమైన ఫైళ్లూ లేవని, ముఖ్యమంత్రి కార్యాలయమే భూకేటాయింపు జరిపిందని అంటున్నారు. ఈ దరిమిల రెండు రాష్ట్రాల విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన చంద్రబాబు ముందు ముందు ఏం చేస్తారో ఎలా చక్కబెడతారో వేచిచూడాల్సిందే... 

మరింత సమాచారం తెలుసుకోండి: