రుణాల రీ షెడ్యూల్ కు ఆర్బీఐ ఓకే చెప్పిందని అంటున్నారు తెలుగుదేశం నేతలు. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ప్రకటన డైరెక్ట్ గా చేయలేక తెలుగుదేశం వాళ్ల చేయించిందో ఏమో కానీ.. ఆర్బీఐ తరపున తెలుగుదేశం వాళ్లు చెబుతున్నారు. రీ షెడ్యూల్ కు ఆర్బీఐ ఒప్పుకొందని చెబుతోంది. మరి ఇంతకీ రీ షెడ్యూల్ అంటే ఏమిటి? అంటే... రైతులకు బ్యాంకర్లు కొత్త రుణాలు ఇస్తారు. ఎంత అప్పు ఉంటే అంత అప్పును మళ్లీ కేటాయిస్తారు.రైతులకు పాత రుణాలతో సంబంధం ఉండదు.. అలాగని ప్రభుత్వం ఆ రుణాలను చెల్లించేయదు! వాటిని పెండింగ్ లో పెడుతుంది. భవిష్యత్తులో తిరిగి చెల్లిస్తామని ప్రభుత్వం బ్యాంకర్లకు హామీ ఇస్తుంది! రైతు రుణమాఫీ గురించి తప్పించుకోవడానికి తెలుగుదేశం ప్రభుత్వం వేస్తున్న కొత్త ఎత్తు ఇది. ప్రభుత్వం దగ్గర నిధులు లేవు. ఆ కారణం చెప్పి రుణమాఫీని చేయమని అంటే.. ప్రజలు ఊరుకోరు! ఎన్నో ఆశలు పెట్టుకొన్న రైతులు ఇప్పుడు గానీ బాబు హ్యాండ్ ఇస్తే... ఎదురుతిరుగుతారు. తీవ్రమైన వ్యతిరేకత ప్రబలుతుంది. దీంతోనే అంతిమంగా రీ ఫెడ్యూల్ వ్యూహాన్ని అనుసరిస్తోంది ప్రభుత్వం. ఈ విధంగా రీ షెడ్యూల్ చేయడం వల్ల ఐదేళ్ల తర్వాతనైనా ప్రభుత్వం బ్యాంకర్లకు లోన్ల మొత్తం చెల్లించాల్సి వస్తుంది. దీని వల్ల వచ్చే ప్రభుత్వంపై భారీ భారం పడే అవకాశాలున్నాయి. అయితే రీ షెడ్యూల్ కు కూడా బ్యాంకర్లు అంత సులభంగా ఒప్పుకొంటారనే నమ్మకంలేదు! ఆర్బీఐ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించలేదు. ఇప్పటి వరకూ ఇది తెలుగుదేశంచెబుతున్న మాట మాత్రమే!

మరింత సమాచారం తెలుసుకోండి: