మహబూబ్ నగర్ జిల్లా సరిహద్దుకు, కర్ణాటకలోని రాయచూర్ జిల్లా సరిహద్దుకు నడుమ తుంగభద్ర నదిపై నిర్మించిన రాజోలిబండ డైవర్షన్ స్కీం(ఆర్డీఎస్) ఆనకట్ట వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ జరుగుతున్న ఆనకట్ట ఎత్తు పెంపుదల పనులను ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు అడ్డుకోవడంతో కర్ణాటక సర్కారు భారీ భద్రతను ఏర్పాటు చేసింది. అయితే ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీ, తెలంగాణల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఆనకట్ట ఎత్తు పెంచాలని తెలంగాణ అంటుంటే అలా జరిగితే రాయలసీమకు తీవ్ర నష్టం చేకూరుతుందని ఆంధ్రప్రదేశ్ వాదిస్తోంది. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కమీషన్, కేంద్ర జలవనరుల శాఖా విభాగం మరియు కర్ణాటక ప్రభుత్వాలకు ఆర్డీఎస్ ఆనకట్ట ఎత్తు పెంచడంపై పిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఆంద్రప్రదేశ్ నీటిపారుదల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కర్నాటక ప్రభుత్వం 2005వ సంవత్సరం నుండే ఆనకట్ట ఎత్తు పెంచుతోందని, అప్పుడు తెరాస దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పాలనలో కాంగ్రెస్ లో ఉందని, అప్పుడు ఆపడానికి ఏ చర్యలు తీసుకోని తెరాస పరిస్థితి చెయ్యి దాటిపోయాక ఇప్పుడు మమ్మల్ని తప్పుపడుతోందంటూ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: