ఏపీ సీఎంగా కుర్చీలో కూర్చున్న చంద్రబాబు ముందు సమస్యలెన్నో ఉన్నాయి. రాజధాని నిర్మాణంతోపాటు అనేక అంశాల్లో ఆది నుంచీ మొదలుపెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఆ సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్న బాబు... రాష్ట్రంలో పేదరిక నిర్మూలనను శాశ్వతంగా రూపుమాపడానికీ ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం మొదట తన సొంత నియోజకవర్గం కుప్పంలో ప్రయోగాత్మకంగా పేదలు లేకుండా చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే అధికారులు చంద్రబాబు ఆలోచనను ఆచరణలో పెట్టడానికి కదిలారు. కుప్పం నియోజకవర్గంలోని కుటుంబాల సంఖ్య... ఇంటిలో పనిచేస్తున్న వారు ఎందరు... వారు ఎంత సంపాధిస్తున్నారు... దానిలో ఎంత ఖర్చవుతోంది... దాచుకుంటున్నది ఎంత... అంటూ ఇలా వివిధ రకాలుగా అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. నియోజకవర్గంలో 20 శాతం మంది పేదరికంలో ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. నెలకు కనీసం పదివేల రూపాయల కంటే తక్కువగా సంపాధించే వారు పేదలుగా నిర్ధారిచంరాు. వీరందరినీ ఆర్థికంగా ముందుకు నడిపేందుకు ఎలాంటి ప్రభుత్వ పథకాలు ఉపకరిస్తాయని ఆలోచిస్తున్నారు. అనవసర ఖర్చులు తగ్గించుకునే దిశగా పేదలను చైతన్యపర్చడం... మహిళలు సైతం ఆర్థికంగా కుటుంబానికి చేయూతనిచ్చేలా ప్రోత్సహించడం... ఇలా పలు రకాలుగా ఆలోచనలు చేస్తున్నారు. పేదరిక నిర్మూలన ప్రక్రియ ప్రయోగంలో టెక్నాలజీని సైతం విరివిగా వినియోగించాలని చంద్రబాబు సూచించారు. ప్రభుత్వ పథకాలు పేదల ధరికి చేరడం, పేదల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఖర్చు చేసే నిధులు పక్కదారి పట్టకుండా చూడడం కోసం ఐవీఆర్ఎస్ విధానాన్ని వినియోగించనున్నారు. ముందుగా కుప్పం నియోజకవర్గంలో పేదలందరినీ ధనికులుగా మార్చిన తర్వాత... రాష్ట్రం పై దృష్టి పెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. తొలిదఫా సమైక్య రాష్ట్ర సీఎంగా హైదరాబాద్ సిటీని హైటెక్ సిటీగా మార్చిన ఈ ఘనుడు... పూర్ లెస్ స్టేట్ గా ఏపీ ని మార్చడంలో ఎంత వరకు సక్సెస్ సాధిస్తారో మరి...

మరింత సమాచారం తెలుసుకోండి: