బీజీ బిజీ గా ఉండే నేటి కాలంలో అటు ఉద్యోగాలు చేసేవారైనా.. బిజినెస్ చేసేవారైనా, స్కూళ్లో పిల్లలైనా వారాంతం వస్తే కాస్త సేద తీరాలని చూస్తుంటారు. దానికి కోసం నగరంలో వివిధ ప్రదేశాలకు వెళ్లి సేద తీరుతారు. నగరంలో చూడదగ్గ ప్రదేశంలో ముఖ్యమైనది నెహ్రూ జూలాజికల్ పార్కు. విషయానికి వస్తే హైదరాబద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ కు బంగారు చేతులు కలిగి ఉండే టమరిన్ జాతికి చెందిన రెండు వానరాలు బుధవారం బహుమతిగా వచ్చాయి. వీటి వయసు ప్రస్తుతం ఒకటిన్నర సంవత్సరాలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ వానరాలను గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పోరేషన్ సంస్థ నెహ్రూ పార్కుకు బహుమతిగా అందచేసింది. ఇవి సహజంగా దక్షిణ అమెరికా, కొలంబియా, అమెజోన్ వంటి ప్రాంతాలలో లభ్యమవుతాయి. ఇవి దాదాపు 20సంవత్సరాల కాలం పాటు జీవిస్తాయి. అయితే ఈ పార్కులో వివిధ రకాల జంతువులు ఉంటాయి. వీటి సంరక్షణ కొరకు జూ అధికారులు చాలా కేర్ తీసుకుంటారు. ఈ వానరాల విషయానికి వస్తే ఇవి సుమారు 250గ్రాముల బరువు ఉంటాయి,పళ్లు,పురుగులు, బల్లులను ఆహారంగా తింటాయి. ఈ జాతి కోతులు 140రోజుల గర్భధారణ సమయం తర్వాత రెండు కవల కోతులకు జన్మనిస్తాయి. ఇవి గుంపులు గుంపులు గా జీవించడానికి ఇష్టపడతాయి. వీటిని పది రోజులు తర్వాత సందర్శనార్ధం ఉంచుతామని అధికారులు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: