ఎన్డీఏ సర్కారు తొలి పద్దులో మెరుపులేవీ లేకపోయినా వ్యవసాయ రంగానికి కొంత ఊతమిచ్చేలా కేటాయింపులు చేసింది. వ్యవసాయరంగాన్ని వ్యవస్థీకరించేందుకు 500 కోట్లు కేటాయించారు. ఈ ఏడాదిలో రైతులకు సమగ్ర వ్యవసాయ సమాచారం కోసం వంద కోట్లతో కిసాన్ టెలివిజన్ ఏర్పాటు చేయనున్నారు. రైతులకందే సబ్సిడీల్లో గోల్ మాల్ జరగకుండా నేరుగా వారి ఖాతాల్లో ఆ సొమ్ము వెళ్లేలా నగదు బదిలీ విధానం ప్రవేశపెట్టే అవకాశముంది. కల్తి ఎరువుల కష్టాలకు చెక్ పెట్టుందకు పోషక విలువల ఆధారిత ఎరువుల సరఫరా చేయనున్నారు. వ్యవసాయ రుణాల లక్ష్యం 8 లక్షల కోట్లు కాగా సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు మూడుశాతం రాయితీ ఇవ్వనున్నట్లు అరుణ్ జైట్లీ తెలిపారు. దీర్ఘకాలిక రుణాల కోసం నాబార్డు సాయంతో కొత్త విధానం అమల్లోకి తేనున్నారు. అలాగే నాబార్డు సాయంతో భూమిలేని రైతులకు 5లక్షల ఆర్ధిక సాయం చేయనున్నారు. 10 కోట్లతో వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి చేయడంతో పాటు పట్టణాల్లో రైతు మార్కెట్లు ఏర్పాటు చేస్తామని జైట్లీ ప్రకటించారు. వ్యవసాయ రంగానికి మెరుగైన నీటి పారుదల వసతుల కోసం వెయ్యి కోట్లు కేటాయించారు. ప్రధానమంత్రి కృషి సించాªâ యోచన కింద నీటి పారుదల వసతులు మెరుగుపరచనున్నారు. రైతులు రుతుపవనాల మీద ఆధారపడే పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు కృషి చేస్తామని మోడీ సర్కారు తెలిపింది. మొత్తానికి వ్యవసాయ రంగానికి ఆహా ఓహో అన్న రీతిలో కేటాయింపులేవీ చేయకపోయినా రైతులకు కొంత ఊరటనిచ్చేలా బడ్జెట్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: