సుప్రీం కోర్టు న్యాయమూర్తి పదవి కోసం పరిశీలనతో ఉన్న ఉదయ్ లలిత్ నేపథ్యం ఆసక్తికరంగా ఉంది. ఈయనను సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమించవచ్చునంటూ సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసు చేసింది. దీంతో ఈయన సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితం కావడం దాదాపుగా ఖాయమైందని చెప్పవచ్చు. ఇటువంటి నేపథ్యంలో ఉదయ్ లలిత్ బ్యాక్ గ్రౌండ్ ను పరిశీలించి చూస్తే.. ఆయన న్యాయవాదిగా ఎన్నో కేసులను వాదించిన అనుమతి ఉన్న వ్యక్తి. దేశంలో సంచలనం రేపిన అనేక కేసుల్లో న్యాయవాదిగా ఆయన వాదనలు వినిపించాడు. 2జీ కేసులో ప్రభుత్వ తరపు న్యాయవాదిగా స్పెషల్ ప్రాసిక్యూటర్ గా వాదించాడు. కృష్ణజింక లను వేటాడిన కేసులో సల్మాన్ తరపున, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అవినీతి కేసులోనూ ఉదయ్ లలిత్ వాదనలు వినిపించాడు. వీటన్నింటికన్నా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈయన బీజేపీ నేత అమిత్ షా తరపు న్యాయవాది కావడం. బూటకపు ఎన్ కౌంటర్ కేసులో అమిత్ షా తరపున ఉదయ్ లలిత్ వాదనలు వినిపించాడు. అలాగే బీజేపీ తరపున ఎంపీగా ఎన్నికైన ఎంకే సింగ్ జన్మదిన వివాదానికి సంబందించిన కేసులో కూడా ఉదయ్ లలిత్ న్యాయవాది. ఈ విధంగా అనేక మంది బీజేపీ వాళ్లకు న్యాయవాదిగా అండగా నిలబడ్డాడు ఈ లాయరు గారు. మరి ఇలాంటి వ్యక్తికి ఇప్పుడు సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితం అయితే... గతంలో చేసిన సహాయాలకు ప్రతిఫలంగా పదవిని ఇచ్చినట్టు అవుతుందేమోనని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: