తినబోతే కరవు, కొనబోతే కొరివి అన్న చందంగా... ఉల్లి ధర పెరిగిన అనంతరం, ఆ సెగ టమోటాను తాకింది. ప్రస్తుతం రాజధాని పరిసర ప్రాంతాల్లో టమోటా ధర ఆకాశాన్నంటింది. రిటైల్‌గా కిలో రూ.50 అమ్ముతున్నారు. గడచిన కొన్ని వారాలుగా ఉల్లి, బంగాళా దుంపల ధరలు పెరిగిన సమయంలో టమోటా ధర తక్కువగా ఉండేది. ఉత్తర భారతంలో వర్షాభావ పరిస్థితులే ధరల పెరుగుదలకు కారణం. ఇంతకుముందు రాజధానిలో టమోటా రిటైల్‌ మార్కెట్‌లో రూ.20 నుంచి 30 వరకు అమ్మేవారు. హోల్‌సేల్‌గా రూ.10-15కు దొరికేది. 15 రోజుల క్రితం అమ్మిన ధరకు రెట్టింపు చేసి సపాల్‌, మదర్‌డైరీ అవుట్‌లెట్స్‌ రిటైల్‌ ధర రూ.40-45 అమ్ముతున్నట్టు సమాచారం. వర్షాభావం ఇలాగే కొనసాగితే నిత్యావసరాల ధరలు ఇంకా పెరుగుతాయి. నగరంలో టమోటా దిగుమతి తగ్గిందని ఆజాద్‌పూర్‌ హోల్‌సేల్‌ మార్కెట్‌ వ్యాపారస్తులు చెప్పారు. కొన్ని వారాలుగా దగ్గరలోని ప్రాంతాలకు హర్యానా రాష్ట్రం నుంచి సరఫరా అయ్యేవి. ఇప్పుడు బెంగళూరు, మహారాష్ట్ర నుంచి కూరగాయలను సేకరిస్తున్నామని పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: