ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అధికార తెలుగుదేశం పార్టీకి ఝలక్ ఇచ్చింది. అధికార తెలుగుదేశం పార్టీ, విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జడ్ పిటిసి సభ్యులను తమ పార్టీలోకి ఫిరాయింప చేసేందుకు ప్రయత్నిస్తే, తెలుగుదేశం పార్టీ తిరుగుబాటు జడ్‌పిటిసి సభ్యుడు ఈదర హరిబాబు అభ్యర్థిత్వానికి మద్దతు పలికింది. తెలుగుదేశం పార్టీ కూడా జడ్పీ చైర్మన్‌గా మన్నె రవీందర్ పేరు ప్రతిపాదించింది. ఇప్పటి వరకూ జడ్పీ పీఠంపై ఆశలు పెట్టుకున్న ఈదర హరిబాబు స్వతంత్ర్య అభ్యర్థిగా రంగంలోకి దిగారు. హరిబాబు అభ్యర్థిత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు బల పరిచారు. స్వతంత్ర్య అభ్యర్థిగా నామినేషన్ వేసిన హరిబాబుతో రాష్ట్ర మంత్రి శిద్ధా రాఘవరావు తదితరులు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఈదర మరిబాబుకు 28 ఓట్లు, తెదేపా నేత మన్నె రవీందర్‌కు 27 ఓట్లు వచ్చాయి. దీంతో ఒక్క ఓటు తేడాతో ఈదర హరిబాబు జడ్పీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈదర హరిబాబు గతంలో ఒంగోలు శాసనసభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో 31 జడ్‌పిటిసి స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ 25 జడ్‌పిటిసి స్థానాలు గెలుచుకున్నాయి. ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ జడ్‌పిటిసి సభ్యులు తెలుగుదేశం పార్టీలోకి మారారు. మరో జడ్‌పిటిసి సభ్యుడు వెంకట రంగారెడ్డిపై అనర్హత వేటు పడింది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల బలబలాలు చెరి సమానంగా 27కు చేరుకున్నాయి. ఫలితంగా ఈదర హరిబాబు అభ్యర్థిత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలకడంతో పరిస్థితి మారిపోయింది. తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసిన ఈదర హరిబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఎలా పోటీ చేస్తారని మంత్రి శిద్దా రాఘవరావు తదితరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జడ్‌పిటిసి సభ్యుడు బాలాజీ జడ్పీ వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: