కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయం పై ఉస్మానియా యూనివర్సిటీ లో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ మేరకు విద్యార్దులు యూనివర్సిటీ లోని ఎన్ సీసీ గేటు వద్దకు చేరుకొని తమ నిరసనలు తెలియజేశారు. ఉదయం 11 గంటలకు విద్యార్దులు ర్యాలీ గా యూనివర్సిటీ లోని ఎన్ సీసీ గేటు వద్దకు అక్కడకు చేరుకొని కెసిఆర్ కు, తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు.  కెసిఆర్ తీసుకున్న నిర్ణయం వల్ల విద్యార్దులకు ఉద్యోగాలు రాకుండా పోతాయని వారు ఆందోళన వ్యక్తం చేసిన విద్యార్దులు, ప్రభుత్వ, కెసిఆర్ దిష్టి బొమ్మలను దగ్దం చేశారు. ఘటనపై ఓయు ఇన్సెపెక్టర్ ఎవీఆర్ నరసింహారావు మాట్లాడుతూ పరిస్దితి అదుపులోనే ఉందన్నారు. ఎవరు కూడా రాళ్ళు రువ్వుకోవటం, విద్యార్దులను ఎవ్వరిని అరెస్ట్ చేయలేదని, ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు నరసింహారావు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: