ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు రుణాల మాఫీ అంశం ప్రశ్నల రూపంలో ఎదురవుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలో రైతుల నుంచి , మహిళ నుంచి ప్రశ్నలు రాగా, నెల్లూరు జిల్లాలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు ప‌్రసంగిస్తుండగా కొందరు మహిళలు డ్వాక్రా మహిళలు తమ రుణాల మాఫీ గురించి ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు నెల్లూరు-కావలి మధ్య విమానాశ్రయం ఏర్పాటు చేయాలని మాట్లాడుతున్న సమయంలో కొందరు మహిళలు ఈ ప్రశ్న వేశారు.దానికి చంద్రబాబు సమాధానం చెబుతూ డ్వాక్రా మహిళలకు న్యాయం చేస్తామని అన్నారు. త్వరలోనే వారికి అనుగుణమైన నిర్ణయం చేస్తామని అన్నారు. రైతుల రుణాల మాఫీ గురించి మాట్లాడుతూ రైతు కుటుంబంలో ఒక్కరికైనా మేలు జరిగేలా చేయాలని ప్రయత్నిస్తున్నామని ఆయన అన్నారు.ఎర్రచందనం,ఇసుక మాఫీయా తదితర అంశాల గురించి కూడా ఆయన మాట్లాడారు.రాష్ట్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటోందని ,అయినా ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నానని చంద్రబాబు చెప్పారు.మొత్తం మీద చంద్రబాబును ప్రశ్నించడం ఆరంభమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: