నెల్లూరు జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పదవిని ఎట్టకేలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసు కుంది. నెల్లూరు జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఎన్నికయ్యారు. గత రెండు సార్లుగా వాయిదా పడుతూ వస్తున్న ఛైర్మన్‌ ఎన్నిక తీవ్ర ఉత్కంఠత మధ్య ఆదివారం జరిగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు,న్యాయస్థానం సూచనల మేరకు ఎన్నికల పరిశీలకులు రామాంజ నేయులు, జిల్లా కలెక్టర్‌ ఎన్‌.శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో ఛైర్మన్‌ ఎన్నికను నిర్వహించారు. అయితే మధ్యా హ్నాం ఒంటి గంట వరకు టిడిపికి, వైఎస్సార్‌ సిపికి చెరి సమంగా సంఖ్యాబలం(23) ఉండటంతో కలెక్టర్‌ కోఆప్షన్‌ సభ్యులను లాటరీ ద్వారా ఎన్నిక చేశారు. వైకాపా సభ్యునిగా అక్బర్‌ బాషా, తెలుగుదేశం పార్టీ సభ్యునిగా చాంద్‌ బాషా ఎన్నికయ్యారు. అక్కడ కూడా రెండుపార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఎన్నిక కావడంతో ఛైర్మన్‌ ఎన్నికను మధ్యాహ్నాం 3గంటలకు వాయిదా వేశారు. అనంతరం 3గంట లకు ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైన కొద్దిసేపటికే జడ్పీ పీఠాన్ని వైఎస్సార్‌సిపి కైవసం చేసుకుంది. ఛైర్మన్‌గా బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఎన్నికయ్యారు. వైస్‌ ఛైైర్మన్‌గా శిరీషాను లాటరీ పద్దతిలో ఎన్నుకు న్నారు. దీంతో జడ్పీపీఠాన్ని తామే కైవసం చేసు కుంటామన్న ధీమాతో ఉన్న టిడిపి ఖంగుతిన్నది. కొత్తగా ఎన్నికైన ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌తో జిల్లా కలెక్టర్‌ శ్రీకాంత్‌ ప్రమాణస్వీకారం చేయించారు. కాగా గత రెండుసార్లు జరిగిన జడ్పీ ఛైర్మన్‌ ఎన్నిక సందర్భంగా తీవ్ర ఘర్షణలు, తోపులాటలు, లాఠీఛార్జీలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా ఐ.జి సునీల్‌ కుమార్‌ ఆదేశాలమేరకు ఏఎస్పీ రెడ్డి గంగాధరం, నగర ,కావలి డిఎస్పీలు వెంకటనాధ్‌రెడ్డి, బాలవెంకటేశ్వర రావు ఆధ్వ ర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. దేవుడిచ్చిన తీర్పు - బొమ్మిరెడ్డి : అధికార బలంతో జడ్పీ ఎన్నికను రెండు సార్లు వాయిదా వేయించిన తెలుగుదేశంపార్టీ ఎమ్మెల్యేలు, నాయ కులకు దేవుడే తగిన బుద్ది చెప్పాడని జడ్పీ ఛైర్మన్‌గా ఎన్నికైన బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అన్నారు. జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ది చేస్తానని స్పష్టంచేశారు. వైకాపా సభ్యులను అధికార పార్టీనాయకులు ఎన్ని ప్రలోభాలకు, వేధింపులకు గురిచేసినా లొంగకుండా తమ వెంటే ఉన్నారన్నారు. అమ్ముడుపోయిన 8మంది వైఎస్సార్‌ సిపి సభ్యులకు భగవంతుడే బుద్దిచెబుతాడని అన్నారు. ధర్మమే గెలిచింది : ఎమ్మెల్యేలు : అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు, వేధింపులకు గురిచేసి ఛైర్మన్‌ ఎన్నికను వాయిదా వేయించినా చివరకు ధర్మమే గెలిచిందని వైఎస్సార్‌సిపి ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌, డా|| అనిల్‌కుమార్‌ యాదవ్‌, కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, పాశం సునీల్‌కుమార్‌, రామిరెడ్డి ప్రతాప్‌ కుమా ర్‌రెెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్‌ మేరిగ మురళి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: