లార్డ్స్ మైదానంలో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ విజయం దిశగా సాగుతోంది. 319 పరుగుల లక్ష్యఛేదనలో నాలుగో రోజు ఆట చివరికి ఇంగ్లండ్ 4 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. భారత్ విజయం సాధించాలంటే 6 వికెట్లు అవసరం కాగా, ఇంగ్లండ్ గెలుపునకు 214 పరుగులు కావాలి. పిచ్ పరిస్థితి దృష్ట్యా అది అసాధ్యంగానే కనిపిస్తోంది. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో భారత్ 295 పరుగులు, ఇంగ్లండ్ 319 పరుగులు చేశాయి. ఇక, రెండో ఇన్నింగ్స్ లో భారత్ 342 పరుగులు చేయడం తెలిసిందే. కాగా, లార్డ్స్ లో ఇప్పటివరకు అత్యధిక పరుగుల ఛేదన రికార్డు విండీస్ పేరిట ఉంది. 1984లో ఆ జట్టు రెండో ఇన్నింగ్స్ లో వికెట్ నష్టానికి 344 పరుగులు చేసి ఇంగ్లండ్ జట్టును చిత్తుచేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: