రాష్ట్ర పతి భవన్ ప్రాంగణంలో దేశ విదేశీ అతిథుల మధ్య అనేక మంది ప్రముఖుల మధ్య జరిగిన ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారానికి 17 లక్షల రూపాయలు ఖర్చు అయ్యిందని ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్అధికారులు స్పష్టంగా ప్రకటన చేశారు. కొన్ని గంటల ఆ కార్యక్రమానికి అంత సొమ్మును వెచ్చించామని వివరించారు. మరి ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారానికి 17 లక్షల రూపాయల ఖర్చు అంటే.. అది పెద్ద మొత్తంకాదనుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే.. ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారోత్సవాలకు అంతకన్నా ఎక్కువ ఖర్చవుతోంది కాబట్టి. ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారోత్సవాలను తీసుకోవచ్చు. వీరిలో కేసీఆర్ చాలా సాదాసీదా గా ప్రమాణస్వీకారం చేశాడు. మోడీ రాష్ట్ర పతి భవన్ లో ప్రమాణం చేసినట్టుగా కేసీఆర్ రాజ్ భవన్ లో కార్యక్రమాన్ని ముగించాడు. అతిరథ మహారథులు లేకుండానే కేసీఆర్ తన బాధ్యతలను స్వీకరించాడు. పొదుపుగా కార్యక్రమాన్ని ముగించాడు. అయితే ఏపీ ముఖ్యమంత్రి మాత్రం తన రాష్ట్ర ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా భారీ ఎత్తు న ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించుకొన్నాడు. విశాలమైన మైదానంలో వేలమంది కార్యకర్తల మధ్య , అనేక మంది ప్రముఖులను అతిధులుగా పిలుచుకొని వారందరి మధ్య తన దర్పాన్ని చాటుకొంటూ పదవీ బాధ్యతలను స్వీకరించాడు తెలుగుదేశం అధ్యక్షుడు. ఒకవైపు ఏపీ అర్థిక వ్యవస్థ గురించి ఆందోళన వ్యక్తం చేస్తూనే.. ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహించడానికి భారీగా ఖర్చు చేశారనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఇప్పుడు ఎలాగూ ప్రమాణస్వీకారోత్సవం గురించి మోడీ ప్రభుత్వం వివరాలను ప్రకటించినట్టుగా... కేసీఆర్ , చంద్రబాబు లు కూడా తమ తమ ప్రమాణస్వీకారోత్సవాలకు ఎంతెంత ఖర్చు అయ్యిందో ప్రకటిస్తే.. బాగుంటుంది. ఇందుకు సంబంధించి శ్వేతపత్రాలను విడుదల చేసి.. ఎంత ఖర్చు పెట్టారో ప్రజలకు తెలియజేస్తే సబబుగా ఉంటుంది. మాటెత్తితోమోడీ తో పోల్చుకొనే నేతలు ఇలాంటి వ్యవహారాల్లో కూడా భుజాలు తడుముకొంటే వాళ్లు నిజంగానే మోడీకి సమానులు అవుతారు!

మరింత సమాచారం తెలుసుకోండి: