వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే అభియోగం నేపథ్యంలో మహారాష్ట్ర పోలీసులు ఎంఐఎంఎమ్మెల్యేఅక్బరుద్దీన్‌ నోటీసులు అందజేశారు. మహా రాష్టల్రోని ఒక కోర్టు నుంచి ఆయనకు ఈ తాఖీదులందాయి. గతంలో అక్బరుద్దీన్‌ మ హారాష్ట్ర పర్యటనలో భాగంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూఆయనపై కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ ఆరోపణలపై సమాధాన మివ్వాలని పేర్కొంటూ కోర్టు సమన్లు జారీ చేసింది. అంతేకాకుండా ఈ నెల 23న థానేలో జరగే సభకు హాజరుకావద్దని కూ డా కోర్టు ఆదేశించింది. ఈ మేరకు మహారాష్టల్రోనిముంద్రా పోలీసులు సోమవారం అ క్బరుద్దీన్‌ నివాసానికి చేరుకొ ని కోర్టు జారీ చేసిన సమన్లను అందజేశారు.  అప్రజాస్వామికం: అక్బరుద్దీన్‌...తనను మహారాష్టక్రు రావద్దంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సమన్లపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ తీవ్రంగా మండి పడ్డారు.థానేకు రావద్దంటూ మహారాష్ట్ర సర్కారు స మన్లు జారీ చేయడంపై చట్ట విరుద్దమన్నారు. సోమవారం మహరాష్ట్ర పోలీసులు సమన్లు జారీ చేసిన అనంత రం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సీఆర్‌పీసీ 144 సెక్షన్‌ ప్రకారం థానేపోలీసు కమిషనర్‌ తనకు సమన్లు ఇవ్వడం అప్రజ్వామి మన్నా రు. థాననే కాదు, ఔరంగాబాద్‌, ముంబై, ఉత్తరప్రదేశ్‌కు కూడా వెళ్తానని అన్నారు. తనకు దేశంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు, పర్యటించే హక్కు ఉందని అక్బరుద్దీన్‌కు స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: