జీఎంఆర్ సంస్థ తాజాగా పోర్టు నిర్మాణ రంగంలోకి తొలి సారిగా అడుగుపెడుతోంది. అయితే దీనికి సంబంధించి కాకినాడ స్పెషల్ ఎకానమీ జోన్ (కేసెజ్) బ్యాక్ యార్డులో భారీ పోర్టు నిర్మాణానికి జీఎంఆర్ సంస్థ ప్రాధమిక అధ్యయనం పూర్తి చేసిందని సమాచారం. కాగా కాకినాడ సెజ్ కు కేటాయించిన 10,500 ఎకరాలలో పోర్టు కోసం 2,100 ఎకరాలను ఎంపిక చేసినట్లుగా తెలియవస్తోంది. అయితే పోర్టు నిర్మాణానికి అయ్యే వ్యయం 2500కోట్లుగా ప్రాధమిక అంచనా వేసినట్లు తెలుస్తోంది. అలాగే ఆధునిక గ్రీన్ ఫీల్డ్ పోర్టు రూపకల్పనకు శ్రీకారం చుట్టిన జీఎంఆర్ కార్గో, కంటైనర్ కార్గో, ఎగుమతి, దిగుమతి లాంటి సదుపాయాలు కల్పించే విధంగా ప్రణాలళికను సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక తూర్పు తీరంలో అతిపెద్ద, ఆధునిక కార్గో హబ్ ను నిర్మించే ఆలోచనలో జీఎంఆర్ సంస్థ ఉందని సమీప వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే దీనిపై అధికారులు మాట్లాడుతూ ఆరు నెలల్లో పబ్లిక్ హియరింగ్ కు వెళతామని ఆతర్వాత మూడేళ్ళలో ప్రాజెక్టు పూర్తి చేస్తామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: