లోకల్ లొల్లి ఢిల్లీకి చేరనుంది. స్థానికత అంశాన్ని కేంద్రం దగ్గర తేల్చుకునేందుకు ఏపీ సర్కారు సిద్ధమవుతోంది. 1956 కటాఫ్‌పై తెలంగాణ ప్రభుత్వం వెనక్కు తగ్గకపోవడంతో హస్తినకెళ్లి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. అఖిలపక్ష నేతలంతా ప్రధానిని కలుస్తున్నారు. స్థానికత ఎపిసోడ్ ఇక హస్తినకు చేరనుంది.. ఆంధ్రప్రదేశ్ అఖిలపక్షమంతా తరలివెళ్లి తెలంగాణ ప్రభుత్వ తీరుపై కేంద్రానికి కంప్లయింట్ చేసేందుకు సిద్ధమైంది.. స్థానికత నిబంధన, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం మేరకు ఉమ్మడి ప్రవేశాల కోసం కేంద్రం దగ్గరకు అఖిలపక్షాన్ని తీసుకెళ్తున్నట్లు మంత్రి రావెల కిషోర్ బాబు తెలిపారు.  ప్రధాని మోడీతోపాటు కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, రాజ్ నాథ్ సింగ్ లను అఖిలపక్ష నేతలంతా కలవనున్నారు.. స్థానికత అంశంపై 1956 కటాఫ్ పై తెలంగాణ కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడంతో ఆంధ్రా ప్రాంత నేతలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్న గంటా చాంబర్ లో సమావేశమైన అఖిలపక్ష నేతలు... ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని భావించారు.. ఆ తర్వాత చంద్రబాబుతో చర్చలు జరిపిన అనంతరం దీనిపై నిర్ణయం తీసుకున్నారు.. మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాసరావుతోపాటు బీజేపీ, వైసీపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నేతల బృందం ఢిల్లీ వెళ్లి.. కేంద్రానికి నివేదించనున్నారు.. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్థానికతపై న్యాయపోరాటం చేయాలని భావిస్తున్నారు.. కోర్టుకు వెళ్లడంతోపాటు అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: