రైల్వే క్రాసింగ్ లు డేంజర్ జోన్లుగా మారుతున్నాయి. రైల్వే శాఖ నిర్లక్ష్యంగా ప్రాణాలు కొల్పోతున్నారు అభాగ్యులు. మెదక్ జిల్లా మూసాయి పేట ప్రమాదం….మరోసారి మన రైల్వేల భద్రతను ప్రశ్నించింది. కాపలా లేని రైల్వే క్రాసింగుల దగ్గర తరచూ ప్రమాదాలు జరుగుతున్నా…అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రమాదాలను నివారించడానికి రైల్వే మినిస్ట్రీ తీసుకుంటున్న చర్యలు శూన్యం. దేశంలో మొత్తం 32, 694 లెవెల్ క్రాసింగులుంటే…..వాటిలో 14, 853 క్రాసింగుల దగ్గర కాపలా మనిషే లేడు. భద్రతకు రైల్వేమినిస్ట్రీ ఇస్తున్న ఇంపార్టెన్స్ ఇది. కాపలా లేని రైల్వే క్రాసింగులు ….ప్రజల పాలిట శాపంగా మారుతున్నాయి. ఉసురు తీస్తున్నాయి. రైలు వస్తున్న విషయం తెలియక….హడావిడిగా క్రాసింగ్ దాటుతూ…..ప్రాణాలు కోల్పోతున్నారు ప్రజలు.   మనదేశంలో మెజారిటీ రైల్వే ప్రమాదాలు…..కాపలా లేని రైల్వే క్రాసింగుల దగ్గరే జరుగుతున్నాయి. నాలుగేళ్ల కిందట….అప్పటి యూపీఏ గవర్నమెంట్ ఈ విషయం పై రియాక్ట్ అయింది. రైల్వేక్రాసింగ్ ప్రమాదాల నివారణకు ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఇప్పటివరకు దీనిని ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల సదానందగౌడ ప్రవేశపెట్టిన రైల్వేబడ్జెట్ లో కూడా కాపలా లేని రైల్వే క్రాసింగుల ప్రమాదాలను హై లెట్ చేశారు. 5,400 కాపలా లేని రైల్వేక్రాసింగులను మూసివేస్తున్నట్లు ప్రకటించింది ఎన్డీయే ప్రభుత్వం. దీని కోసం పక్కా ప్రణాళిక తయారు చేస్తున్నట్లు కూడా డిక్లేర్ చేశారు రైల్వే మంత్రి సదానంద. అయితే, ఇప్పటివరకు దీనిపై ఎలాంటి ఫాలోఅప్ జరగలేదు.  మన అధికారులకు ….బుల్లెట్ ట్రైన్ ప్రకటించి…చేతులు దులుపుకోవాలన్న ఆరాటమే తప్ప……ప్యాసింజర్ల సేఫ్టీ కి గ్యారంటీగా నిలవాలన్న ఆలోచన ఏమాత్రం లేదు. నూట నలభై ఏళ్లు పైబడిన ఇండియన్ రైల్వే చరిత్రలో భద్రతకు భరోసాయే లేదు. నిధులున్నా నిర్వహణా లోపం, అధికారుల నిర్లక్ష్యంతో తరచూ రైల్వే ప్రమాదాలే జరుగుతూనే న్నాయి. ప్రమాదాలపై దర్యాప్తు కూడా తూతూ మంత్రంగానే జరుగుతోంది. భద్రతకు సంబంధించి వేసిన రకరకాల కమిటీల సిఫార్సులను బుట్టదాఖలు చేస్తున్నారు అధికారులు. ఇప్పటికైనా….ఈ సిఫార్సులను వెంటనే అమలు పరిస్తే…..ప్రమాదాలు తగ్గుతాయి. జనం ప్రాణాలు నిలుస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: